బాబీ, స్కూల్‌కి వెళ్లే పదమూడేళ్ల పిల్లాడు. బాక్సింగ్ నేర్చుకోడానికి వెళ్తాడు కానీ తన్నులు తింటాడు. అతనికి ఒక తాగుబోతు తల్లి ఉంటుం ది. అన్నం సరిగా పెట్టదు కానీ ప్రేమ మాత్రం లె క్కలేనంత కురిపిస్తూ ఉంటుంది. తన తండ్రి పేరు జాన్ జోన్స్ అని తప్పా, అతనెలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు అనేది కూడా బాబీకి తెలియదు. ఇరుకుగా, మురికిగా ఉండే ఒకే ఒక గది. అది కూడా ప్రభుత్వం పేద వాళ్ళకి ఇచ్చే పబ్లిక్ హౌ సింగ్ ఏరియాలో తన తాగుబోతు తల్లితో కలిసి ఉంటాడు బాబీ. అక్కడ చూస్తే ఆ ఏరియా మొత్తం డ్రగ్ అడిక్ట్ ఉండే చోటు. గొడవలు, పోలీస్ రై డ్స్ చాలా సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఇంత ప్రతికూల పరిస్థితుల్లోనూ సానుకూలంగా ఉంటూ జీవితం మీద ఏదో ఆశతో బతుకుతుంటాడు బాబీ. పాటలు పాడటం వినడం అంటే ఇష్టం ఉండే ఈ బాబీగాడికి స్టేజ్ ఫియర్ ఎక్కువ. అప్పుడే అతని జీవితంలోకి ఆదా అని డబ్బున్న కు టుంబంలో పుట్టిన అమ్మాయి వస్తుంది. బాత్ రూంలో మాత్రమే పాటలు పాడుకునే వాడి జీవి తం ఆ అమ్మాయి వచ్చాక ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగతా కథ.
నిజానికి బాబీ గాడు కావాలనుకుంటే పూర్తిగా చెడిపోడానికి దారులు ఉంటాయి. గాబ్రియేల్ లాంటి డ్రగ్ అడిక్ట్ పరిచ యం అయ్యాక చెడిపోవడం చాలా ఈజీ. అలాగే ఆదా వచ్చాక ఆమెని ప్రేమించి మరొక లైఫ్ స్టార్ట్ చేసే అవకాశం కూడా చాలా ఉంది. కానీ వీటన్నిటి కన్నా కూడా బాబీగాడికి తన పేదరికం, త న లక్ష్యమే పెద్దదిగా కనిపిస్తుంది. అందుకే చివరి దాకా సానుకూలంగా జీవితాన్ని గడుపుతాడు. ఇ లాంటి పేదరికం, ప్రతికూల పరిస్థితుల నుంచి బాబీ తన జీవితాన్ని, కలను ఎంత పాజిటివ్‌గా మలచుకున్నాడు అనేదే నవలలోని కథ. ఆర్నీ స్వింజె న్ అనే ప్రపంచ ప్రసిద్ధ పిల్లల పుస్తకాల రచయిత, నార్వేజియన్‌లో రాసిన నవల తెలుగు అనువా దం అయిన ఈ పుస్తకాన్ని పిల్లలే కాదు, పెద్దలూ చదివి తీరాలి. అలా అని సీరియస్ నవల కాదు. బాబీగాడి పంచులు నవ్విస్తూనే, ఒక క్షణం లోతుగా ఆలోచింపజేస్తాయి.