Wednesday, January 22, 2025

ఆరోగ్య మిత్రలను ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉద్యోగులుగా గుర్తించాలి

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్ ః రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మిత్రలుగా పనిచేస్తున్న సిబ్బందిని ఆరోగ్య శ్రీ ట్రస్టు ఉద్యోగులుగా గుర్తించాలని ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ డిమాడ్ చేసింది. ఆరోగ్య మిత్రల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య మాట్లా డుతూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆరోగ్య మిత్రలను స్కిల్డ్ ఎంప్లాయిస్‌గా గుర్తించి, అందుకు తగ్గట్టు క్యాడర్‌ను అప్‌గ్రేడ్ చేయాలన్నారు. కనీస వేతనాల చట్టం ప్రకారం రూ. 28 వేల వేతనం చెల్లించా లన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి, షఫ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పిహెచ్‌సి ఆరోగ్య మిత్రలను తిరిగి పిహెచ్‌సిలోనే విధులు నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

విధి నిర్వహణ లో మరణించిన ఆరోగ్య మిత్రలకు వారి కుటుంబానికి రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిఐటియూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ మాట్లాడుతూ 16 ఏళ్లుగా వైద్య శాఖలో ఆరోగ్య మిత్రలుగా పనిచేస్తున్న నేటికీ కనీస వేతనాలు చెల్లించకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నా రు. ఆరోగ్య మిత్రలు అంతా పోరాటానికి సిద్దం కావాలన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య మిత్రల ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి యం. కుమార్, ఉపాధ్యక్షులు విష్ణు, నాయకులు నరేష్ కుమార్, అనూజ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News