అఫ్తాబ్ ‘మొదటి మహిళా పాకిస్థానీ గ్రామీ విజేత’ అని అకాడమీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అఫ్తాబ్ తన తొలి ఆల్బమ్ ‘బర్డ్ అండర్ వాటర్’ పేరుతో 2014లో తన స్వంత స్వతంత్ర లేబుల్‌తో విడుదల చేసింది.
నెవెడా(లాస్ వెగాస్, అమెరికా): కవి హఫీజ్ హోషియార్‌పురీ ఒక గజల్‌ను 1929లో కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్‌తో కలిసి గవర్నమెంట్ కాలేజ్(ప్రస్తుతం గవర్నమెంట్ కాలేజ్ యూనివర్శిటీ)లో ఆలపించారు. అదే గజల్ పాడి బ్రుక్లిన్‌కు చెందిన అరూజ్ అఫ్తాబ్ సోమవారం లాస్‌వెగాస్‌లో 64వ గ్రామీ అవార్డును తొలిసారి గెలుచుకునేలా చేసింది.
హోషియార్‌పురీ ‘నయా సూఫీ’ వర్షన్ గజల్ ‘మొహబ్బత్ కర్నే వాలే కమ్ నా హోంగే, తేరి మెహఫిల్ మే లేకిన్ హమ్ నా హోంగే’ను ఇదివరలో మెహదీ హసన్, ఫరీదా ఖానమ్, గులామ్ అలీ, జగజీత్ సింహ వంటి గాయకులు పాడారు. అదే గజల్‌ను పాడి 37 ఏళ్ల పాకిస్థానీ మహిళ అరూజ్ అఫ్తాబ్ ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫామెన్స్’ అవార్డును ఏప్రిల్ 3న గెలుచుకుంది. ఈ ఏడాది రికార్డింగ్ అకాడమీలో ఈ కేటగిరిని కొత్తగా చేర్చారు.
అకాడమీ తన అధికారిక ఇంస్టాగ్రామ్ పేజీ పోస్ట్‌లో ‘తొలి పాకిస్థానీ మహిళ..గ్రామీ విజేత’ అని పేర్కొంది.అరూజ్ అఫ్తాబ్ ‘మొహబ్బత్’ ఆల్బమ్ ‘వల్చర్ ప్రిన్స్’లోది. అది ఆ ఆల్బమ్‌లో లీడ్ పీస్. అయితే అది బెనినీజ్ గాయకుడు-గేయరచయిత ఏంజెలిక్ కిదజో ‘డు యువర్‌సెల్ఫ్’ , నైజీరియా గాయకుడు ఫెమీ కుటీ ‘పా పా పా’, నైజీరియా విజ్‌కిడ్ అండ్ టేమ్స్ పాడిన ‘ఎసెన్స్’, కిడ్జో , సెలో లిజెండ్ యో యో మా పాడిన ‘బ్లేవూ’లను వెనక్కి నెట్టేసి గెలుపొందింది.