Wednesday, January 22, 2025

ఆపరేషన్ ఆరూరి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయా లో ఆరూరి రమేశ్ కేంద్రంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్ధన్నపేట మాజీ ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్ కేంద్రంగా హైడ్రామా నెలకొంది. మొదట ఆరూరి రమేష్ బిఆర్‌ఎస్‌ను వీ డి, వరంగల్ పార్లమెంటు స్థానానికి బిజెపి తరఫు న పోటీ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ప్ర చారానికి బలం చేకూర్చుతూ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం అయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన బిఆర్‌ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, ఎంఎల్‌సి బస్వరాజ్ సారయ్య, కుడా మాజీ ఛైర్మన్ సుందర్ రాజ్ తదితరులు ఆ రూరి నివాసానికి చేరుకుని ఆయనతో చర్చించా రు. ఈ సమయంలో  హన్మకొండలోని ఆరూరి రమేశ్ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదే సమయంలో ఆరూరి రమేష్‌ను కారులో ఎక్కించేందుకు ప్రయత్నించగా ఆరూరి అనుచరులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బిజెపి కార్యకర్తలు పెంబర్తి వద్ద మరోసారి బిఆర్‌ఎస్ నేతల వాహనాలను అడ్డుకోగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఇరువర్గాల తోపులాటల్లో ఆరూరి రమేశ్ చొక్కా చిరిగిపోయింది. స్థానిక నాయకులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో ఆరూరికి ఫోన్ చేయించి మాట్లాడించారు. ఈ జరిగిన విషయం మొత్తం ఆయన కిషన్ రెడ్డికి తెలియజేశారు. బిఆర్‌ఎస్, బిజెపి పార్టీ నేతల పరస్పర నినాదాల నడుమ ఆరూరి రమేష్‌ను బిఆర్‌ఎస్ నేతలు తమ వాహనంలో ఎక్కించుకుని వరంగల్ నుంచి నేరుగా బంజారాహిల్స్ నందినగర్‌లోని అధినేత కెసిఆర్ నివాసానికి తీసుకువచ్చారు.

నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు..బిఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా : ఆరూరి
తాను బిఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నానని వర్ధన్నపేట మాజీ ఎంఎల్‌ఎ ఆరూరి రమేశ్ స్పష్టం చేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. తమ పార్టీ నేలతో కలిసి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలిపారు. నందినగర్‌లోని కెసిఆర్ నివాసం వద్ద ఆరూరి రమేష్ మీడియాతో మాట్లాడుతూ, తాను బిఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని.. తాను అమిత్ షాను కలవలేదని తెలిపారు. అనంతరం ఆయన బిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుతో సమావేశమై అన్ని అంశాలు చర్చించారు. అరూరి రమేష్ పార్టీ మార్పుపై వార్తలు వస్తున్న నేపథ్యంలో అధినేత కెసిఆర్ ఆయనకు కీలక సూచనట్లు చేసినట్లు సమాచారం. పార్టీ మారి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని అరూరికి కెసిఆర్ సూచించినట్లు తెలిసింది.

పోటీకి ఆరూరి రమేష్ విముఖత
వరంగల్ బిఆర్‌ఎస్ ఎంపీగా పోటీ చేసేందుకు అరూరి రమేష్ విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఆధ్వర్యంలో బుధవారం ఆయన నివాసంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్య నేతలతో కెసిఆర్ సమాలోచనలు జరిపారు. ఈ భేటీలో వరంగల్ బిఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా జిల్లా నేతలు మాజీ ఎంఎల్‌ఎ అరూరి రమేష్ పేరు ప్రతిపాదించినట్లు తెలిసింది. కానీ ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని రమేష్ పార్టీ అధినేతకు తేల్చి చెప్పినట్లు సమాచారం. అరూరి పోటీకి నిరాకరించడంతో వరంగల్ బిఆర్‌ఎస్ అభ్యర్థి పేరు ప్రకటన పెండింగ్‌లో పడినట్టు తెలుస్తోంది. వరంగల్ టికెట్ నిర్ణయించే అధికారం పార్టీ నేతలు అధినేత కెసిఆర్‌కే అప్పగించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంఎల్‌సి మధుసూదనచారి,పార్టీ నాయకులు పసునూరి దయాకర్, ఆరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతితో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News