Monday, December 23, 2024

దాదాపు 9.46 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారు !

- Advertisement -
- Advertisement -

 

Passport

న్యూఢిల్లీ: 2015 నుండి ఏడేళ్ల కాలంలో దాదాపు 9.46 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారని,   గత ఏడాది అత్యధికంగా 1.63 లక్షల మంది వదులుకున్నారని, గత రెండేళ్లలో పార్లమెంటులో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానాల విశ్లేషణ తెలిపింది.

హోం మంత్రిత్వ శాఖ మంగళవారం లోక్‌సభకు ఇచ్చిన వ్రాతపూర్వక సమాధానంలో గత సంవత్సరం 1.63 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారని, ఇది ఏడేళ్లలో అత్యధికమని, 2020లో కోవిడ్ -19 తాకినప్పుడు అత్యధికంగా  85,256 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారని తెలిపింది. హోం మంత్రిత్వ శాఖ  ప్రకారం గత ఏడాది 78,284 మంది అమెరికన్ పౌరసత్వాన్ని ఎంచుకున్నందున యునైటెడ్ స్టేట్స్ భారతీయుల యొక్క అతిపెద్ద ఛాయిస్ గా ఉంది.  ఆస్ట్రేలియా (23,533) మరియు కెనడా (21,597) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వ్యక్తులు తమ వ్యక్తిగత కారణాలతో పౌరసత్వాన్ని వదులుకున్నారని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News