Sunday, December 22, 2024

హజ్రత్ నిజాముద్దీన్ దర్గాను సందర్శించుకున్న అర్పితా ఖాన్

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ముద్దుల చెల్లెలు అర్పితా ఖాన్. ఏప్రిల్ 14న సల్మాన్ ఇంటివద్ద కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంతా క్షేమంగానే ఉన్నారు. అయితే అర్పితా ఖాన్ ఢిల్లీకి చేరుకుని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలో మొక్కులు చెల్లించుకున్నారు.

కాల్పుల పైన ఇటీవల సల్మాన్ ఖాన్, అర్పిత భర్త ఆయుష్ శర్మ, తమ్ముడు అర్బాజ్ ఖాన్ ప్రతిస్పందించారు. ఈ కష్ట కాలంలో సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులంతా కలిసికట్టుగా నటుడికి అండగా ఉంటున్నారు.

సల్మాన్ ఖాన్ తండ్రి ఇటీవల ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో  ‘ఈ నిరక్షరాస్యుల గురించి ఏమి మాట్లాడాలి? చంపేస్తే తెలుస్తుంది(గుణపాఠం) అని వారంటారు. మాకు పోలీసు అదనపు భద్రత కల్పించారు. నేడు పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారంటే వారు అదే పని మీద ఉన్నట్లు’ అన్నారు.

Arpita Khan

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News