Monday, December 23, 2024

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులకు సిఎస్ ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్రంలో ఈనెల 8వ తేదీన భారత ప్రధాని నరేంద్రమోడీ పర్యటన కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ప్రధాని మోడీ హన్మకొండలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సిఎస్ బుధవారం బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా ఏర్పాట్లను చేపట్టాలని పేర్కొన్నారు. వరంగల్‌లో ప్రధాని దిగే హెలిపాడ్‌తో పాటు వేదిక వద్దకు చేరుకునే మార్గాల్లో ఆయన పాల్గొనే బహిరంగ సభ వేదిక వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.

నిబంధనలను అనుసరించి అగ్నిమాపక, వైద్య, విద్యుత్, రోడ్లు భవనాలు, సమాచార శాఖలకు తగు పనులు చేపట్టాలన్నారు. ఈసమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిజిపి అంజనీకుమార్, వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్, హన్మకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌లు పాల్గొనగా, సచివాలయంలో ఇంధన శాఖ స్పెషల్ సిఎస్ సునీల్ శర్మ, జిఏడి కార్యదర్శి శేషాద్రి, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ అశోక్‌రెడ్డి, పోలీసు, రైల్వే, బిఎస్‌ఎన్‌ఎల్, ఫైర్, ఏవియేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News