Wednesday, January 22, 2025

ప్రధాని మోడీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పలు అభివృద్ధి పథకాల శంకుస్థాపనలు చేసేందుకు ప్రధాని మోడీ వస్తున్న నేపథ్యంలో పూర్తి ఏర్పాట్లు చేశామని ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఆదివారం ఆమె ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా జిలా ్లకేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు ఆరు వేల కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నట్టు వెల్లడించారు.

ముందుగా సోమవారం ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీ ఆదిలాబాద్‌కు చేరుకుంటారన్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు పలువురు కేంద్రమంత్రులు విచ్చేస్తున్నట్టు తెలిపారు. ప్రత్యేకంగా ప్రధాని, సిఎం, కేంద్ర మంత్రుల ల్యాండింగ్ కోసం హెలీప్యాడ్లను ఏర్పాటు చేయడంపై జిల్లా యంత్రాంగాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News