Saturday, December 28, 2024

తెలంగాణ మంచినీళ్ల పండుగ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

- Advertisement -
- Advertisement -

కొత్తకోట : దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం జరిగే తెలంగాణ మంచినీళ్ల పండుగ వేడుకల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శనివారం కొత్తకోట మండలం కానాయపల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ మంచినీళ్ల పండుగ వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, మిషన్ భగీరథ ఎస్‌ఈ జగన్ మోహన్, ఈఈ మేఘారెడ్డి, కొత్తకోట తహసిల్దార్ బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News