Monday, December 23, 2024

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు పూర్తి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో పురుష ఓటర్లకంటే మహిళ ఓటర్లే ఎక్కువ !
9 లక్షలకుపైగా ఉన్న యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఓటర్ల సిప్లుల పంపిణీ బిఎల్‌ఓలో రేపటి వరకు పూర్తి చేస్తారు: సిఈవో వికాస్‌రాజ్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సజావుగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు వేగంగా పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. అందులో పురుషుల  కంటే మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడుతూ ఈసారి మొదటిసారి ఇంటి నుంచే ఓటింగ్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. యువ ఓటర్లు 9 లక్షలకు పైగా ఉన్నారని, పోస్టల్ బ్యాలెట్లు 4లక్షలు, ఈవీఎం బ్యాలెట్లు 8 లక్షల 84వేలు ప్రింట్ చేసినట్లు పేర్కొన్నారు. ఎపిక్ కార్డులు 51 లక్షలు ప్రింట్ అయ్యి దాదాపు పంపిణీ అయ్యాయి.

రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు వచ్చినట్లు ప్రతి లెక్కింపు కేంద్రంకు ఒక పరిశీలకులు ఉంటారని వెల్లడించారు. మూడు కేటగిరీల్లో ఇంటి వద్దే ఓటింగ్ విధానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 80 ఏళ్లు పైబడిన వాళ్లు 9300 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు 2 కోట్ల 81లక్షల ఓటర్ గుర్తింపు పత్రాల పంపిణీ పూర్తి అయినట్లు రేపటి వరకు ఓటర్ స్లిప్ పంపిణీ పూర్తి అవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు 59వేల బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నట్లు చెప్పారు. సీ విజిల్ యాప్ ద్వారా 6,600 ఫిర్యాదులు అందినట్లు, ఫ్లయింగ్ స్వ్కాడ్ వాహనాలకు జిపిఎస్ ఉంటుందని, ప్రతి నియోజకవర్గానికి మూడు ఎస్‌ఎన్టీ, ఫ్లయింగ్ స్వ్కాడ్స్ ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలంగాణలో ఎన్నికల కోసం 377 కంపెనీల కేంద్ర బలగాలు విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం గతంలో తక్కువగా ఉందని 3 లక్షల మంది పోలింగ్ ఏర్పాట్లలో పాల్గొంటున్నారు. డీఏ గురించి ప్రతిపాదనలు వచ్చియని నిర్ణయం ఈసీఐ ఇంకా తీసుకోలేదన్నారు. 64 వేల మంది రాష్ట్ర పోలీసులు, 375 కేంద్ర కంపెనీల నుంచి బలగాలు ఎన్నికల కోసం సిద్దంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో శాంతి భద్రత సమస్య ఎక్కడ లేదన్నారు. 114 గుర్తింపు పొందిన పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News