Friday, December 27, 2024

ప్రత్యేక సమావేశాల్లోనే ఎంపిల గ్రూపు ఫొటోలకు ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరగవచ్చన్న వార్తల నేపథ్యంలో ఈ నెల 18నుంచి 22 వరకు జరగనున్న పార్లమెంటుప్రత్యేక సమావేశాల సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల గ్రూపు ఫొటోల కోసం ఏర్పాటు చేస్తున్నారు. లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ లేనప్పటికీ ప్రస్తుత పార్లమెంటు చివరి సమావేశాలు ఇవే కావచ్చని, మామూలుగా ఈ ఏడాది ఏప్రిల్‌మే నెలల్లో జరగాల్సిన లోక్‌సభ ఎన్నిలకను ప్రభుత్వం ముందుకు జరపవచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా పార్లమెంటు సభ్యుల పదవీ కాలం ప్రారంభం, ముగింపు సమయాల్లో గ్రూపు ఫొటోలు దిగుతూ ఉంటారు. కాగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండా ఏమిటో ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News