Monday, December 23, 2024

అమిత్ షా పర్యటనకు ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -
29న తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, ప్రముఖులతో అమిత్ షా భేటీ

హైదరాబాద్ : రాష్ట్రంలోని మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు, వివిధ కులసంఘాలు, సామాజిక సంఘాల, నాయకులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశమయ్యేలా బిజెపి రాష్ట్ర శాఖ కార్యక్రమానికి రూపకల్పన చేస్తోంది. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

29వ తేదీ మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర శాఖ పదాధికారులు, తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, జిల్లాల అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలతో.. అమిత్ షా భేటీ అయ్యేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ సమావేశం సందర్భంగా.. తెలంగాణలో పార్టీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోని తీసుకొచ్చే విషయంలో పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా తెలంగాణ మేధావులతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు బిజెపి రాష్ట్ర శాఖ సిద్ధమైంది. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్ షా తొలిసారిగా తెలంగాణకు రానున్నారు. రాష్ట్ర శాసనసభకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో బిజెపి సంస్థాగతంగా బలోపేతం చేసే అంశంపై నేతలతో చర్చించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News