Friday, December 20, 2024

కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

మన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. ఉదయం 8.30 గంటలకు ఇవిఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కౌం టింగ్ ఏజెంట్ల వద్ద, సిబ్బంది వద్ద కూడా సెల్‌ఫోన్లు ఉండవని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి మూల కవర్ చేసే లా సిసి కెమెరాల నిఘా ఉంటుందని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు, బారికేడ్లు, పటిష్ఠ భద్రత ఉంటుందన్నారు. ఎన్నికల లెక్కింపు దగ్గర 4 అంచె ల భద్రత ఉంటుందని తెలిపారు. బిఆర్‌కె భవన్‌లో శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారులతో కలిసి సిఇఒ వికాస్‌రా జ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఇఒ మాట్లాడుతూ, కౌంటింగ్ కేంద్రం వద్ద 4 అంచెల భద్రత ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఫలితాలు వెల్లడించేందుకు పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.17 లక్షల పోస్టల్ బ్యాలెక్టు వచ్చాయని వివరించారు.

పోస్టల్ బ్యాలెట్ల లెక్కిం పు కోసం 276 ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నా రు. ఒక్కో టేబుల్ వద్ద ఇసిఐ మైక్రో అబ్జర్వర్లు ఉంటారని చెప్పారు.ఓట్ల లెక్కింపులో దాదాపు 10వేల మంది సిబ్బంది పాల్గొంటారన్నారు. సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు సిబ్బందిని ర్యాండమ్‌గా కేటాయిస్తామని అన్నారు. లెక్కింపు రో జు ఉదయం 5 గంటలకు మరోసారి ర్యాండమ్‌గా సిబ్బందిని కేటాయిస్తామని అన్నారు. 2400కు పైగా మైక్రో అబ్జర్వర్లు ఉంటారని చెప్పారు. చొప్పదండి, యాకూత్‌పుర, దేవరకొండలో అత్యధికంగా 24 రౌండ్లు ఉంటాయని, అ త్యల్పంగా 13 రౌండ్లు.. ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావుపేటలో ఉన్నాయన్నారు. అలాగే చార్మినార్ నియోజకవర్గంలో 15 రౌండ్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో 17 రౌండ్లు ఉంటాయని చెప్పారు. మొత్తం 1200 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. ప్రతి రౌండ్‌కు 30 నిమిషాల సమయం పడుతుందని అన్నారు.మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలిం గ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.

కౌంటింగ్ రోజున డ్రై డే
ఓట్ల లెక్కింపు రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని సిఇఒ వికాస్‌రాజ్ వెల్లడించారు. ఫలితాల అనంతరం ర్యాలీలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు అనుమతి ఇస్తే ర్యాలీలు నిర్వహించవచ్చని చెప్పారు.
12 కేంద్ర బలగాలతో బందోబస్తు
12 కంపెనీల కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత నిర్వహిస్తున్నారని సిఇఒ వికాస్‌రాజ్ తెలిపారు. వీళ్లు కౌం టింగ్ సమయం వరకు ఉంటారన్నారు. గతంలో లాగా ఈసారి కూడా అవుటర్ మోస్ట్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పారు. కౌంటింగ్ జరిగే ప్రాంతం నుంచి 100 మీటర్ల ప్రాంతం వరకు ట్రాఫిక్‌ను నియంత్రణ చేస్తుంటారని పే ర్కొన్నారు.

నేడు మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల
ఎంఎల్‌సి ఓట్ల లెక్కింపు
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు ఆదివారం(జూన్ 2) జరుగుతుందని సిఇఒ వికాస్‌రాజ్ తెలిపారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. అలాగే నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎంఎల్‌సి ఉప ఎన్నికకు కౌంటింగ్ జూన్ 5న జరుగుతుందని సిఇఒ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News