Tuesday, January 21, 2025

చేప మందు పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

నాంపల్లి: దేశ, విదేశాల నుంచి వచ్చే ఆస్తమా రోగులకు చేప మందు పంపిణీ ప్రక్రియకు సర్వం సిద్ధ్దమవుతోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో మూడేళ్ల తర్వాత బత్తిన కుటుంబం మళ్లీ ఈ దఫా జనానికి ఉచిత చేప మందు ప్రసాదాన్ని ఇవ్వనున్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానం వేదికగా ఈనెల 9తేదీన ఉదయం 8 గంటలకు చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభించనున్నారు. ఈ దిశగా సిఎం కెసిఆర్ నిర్దేశంతో ప్రభుత్వ వివిధ శాఖల సమన్వయంతో వేల సంఖ్యలో రోగులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగాపనులు యుద్ధ ప్రాతిపదికన చకచకా జరుగుతున్నాయి.

కన్యకుమారి నుంచి కాశ్మీర్ వరకు పలు దేశాల నుంచి రోగులు భారీ సంఖ్యలో రానున్నండటంతో ఆ మేరకు అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైనది. ప్రభుత్వ ఆదేశాలతో చేప మందు పంపిణీ, నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా భావించి రెయింబవళ్లు షెడ్ల నిర్మాణం పనులు, కౌంటర్లు ఏర్పాటు, మైదానం చుట్టు విద్యుత్ కాంతుల భిగించడం, మైదానం పరిశుభ్రత చర్యలు, వేల సంఖ్యలో వస్తున్న జనానికి టాయిలెట్ల రిపేర్ల వంటి పనులు జోరందుకున్నాయి. సర్కార్ ఆదేశాల మేరకు ఏర్పాట్ల, నిర్వహణ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. దేశంలో విభిన్న రాష్ట్రాల నుంచి రోగుల తాకిడి మొదలైనది. ఢిల్లీ, యుపీ, రాజస్తాన్, కర్నాటక, బీహార్ తదితర చోట్ల నుంచి రోగులు వచ్చారు.

నగరంలో వారి స్నేహితులు, బంధువుల ఇళ్లలో బస చేస్తున్నారు. అనేక మంది మైదానంలో నిర్మించిన ప్రత్యేక షెడ్లలో ఉంటున్నారు. ఆస్తమా రోగులకు ఎలాంటి ఇక్కట్ల పరిస్థితులు రానీయకుండా వివిధ శాఖల సిబ్బంది దగ్గరుండి ఏర్పాట్లను చేస్తున్నారు. జనానికి భద్రతకు సంబంధించిన విషయాన్ని పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేట్టనున్నారు. మైదానం లోపల, గేట్లు, కౌంటర్ల వద్ద 70 సిసి కెమెరాలను బిగిస్తున్నారు. లోపల కంట్రోల్ రూం నుంచి ప్రజల కదలికలను మానిటరింగ్ చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం ఎగ్జిబిషన్ సొసైటీ ఆఫీస్‌లో మంత్రి టి.శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాకముందు చేప ప్రసాద పంపిణీకి అరకొర ఏర్పాట్లు ఉండేవని, ఈ దఫా మాత్రం జనానికి ఇక్కట్లు, అపశృతి వంటి సమస్యల లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అ సంఖ్యాక వచ్చే ప్రజలకు నీటి దాహార్తి తీర్చేందుకు జలమండలి వర్గాలు ఉచిత స్వచ్ఛమైన నీటి ప్యాకెట్లను అందించనున్నది. మృగశిరకార్తె సందర్భంగా పలు చోట్ల చేప విక్రయ స్టాళ్లను ఏర్పాట్లు చేస్తుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ప్రత్యేక ఆర్టీసీ బస్‌లను నడపనున్నారు. ఈ దఫా మెట్రోరైలు కూడా వారికి అందుబాటులో ఉంది. ప్రజలకు భద్రతకు, ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా 24 గంటలు పోలీసులు తమ విధులు నిర్వహించనున్నారు. ఆలానే ట్రాఫిక్ వర్గాలు వారి సేవలో గడపనున్నారు.

ప్రజలకు ఆహారం, ఫలహారం పంపిణీ చేసేందుకు సేవా సంస్థలు రెడీ
లక్షల మంది వచ్చే అవకాశమున్న నేపథ్యంలో వారి దాహర్తీని తీర్చేందుకు ఉచిత మినరల్ ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు పలు సేవా సంస్థలు ముందుకొచ్చారు. ఈ దిశగా ప్రత్యేక షెడ్ల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఉత్తరాది సంస్థలు రోగులకు ఆహారం, ఫలహరాలు, మంచినీరు. మజ్జిగ ప్యాకెట్లు, పూరీలు, ఇడ్లీలు, పులిహోరీలు పంపిణీకి సిద్ధమవుతున్నారు.

పలు మార్వాడీ సంఘాలు వారికి ఆకలి దప్పికను తీర్చేందుకు తమ దాతృత్వం చాటనున్నారు. ఏటా తరహాలోనే సేవా సంస్థలు సహృదయంతో రోగులకు సేవలందించేందుకు తమ సహృదయతను ప్రదర్శిస్తారు. రెండు రోజుల పాటు ప్రజలకు అందిచనున్నారు. రెండురోజుల పాటు ఇక్కడే పంపిణీ తర్వాత పాతబస్తీలోని దూద్‌బౌలిలో తమ నివాసంలో బత్తిన కుంటుంబం వారం రోజులపాటు చేప మందును అందిచనున్నారు.

ప్రజలకు అన్ని విధాలా సహకరిస్తున్నాం : ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు మార్గం అశ్విన్
ప్రభుత్వ ఆదేశాల మేరకు చేప మందు పంపిణీ ఓ అద్భుత సేవా కార్యక్రమం .. నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తాము అన్ని విధాలా నిర్మాణాత్మకంగా సహకరిస్తున్నాం. ఈ మేరకు ఎగ్జిబిషన్ మైదానంలో వారం రోజులపాటు ప్రైవేట్ కార్యక్రమాల నిర్వహణను రద్దుచేశారు. లక్షల మంది జనం వస్తున్నారు.

వారికి అసౌకర్యాలు, ఇబ్బందులు లేకుండా తమ సంస్థ 24 గంటలు కృషి చేస్తుంది. మైదానంలో టాయిలెట్ల శుభ్రం చేశాం. లోపల పరిశుభ్రత పనులు చేపట్టాం, రోడ్లను అభివృద్ధి చేశాం. ఈ దిశగా అధికారులకు తాము పూర్తిగా సహకరించి చేప మందు పంపిణీని విజయవంతం చేస్తాం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News