Monday, December 23, 2024

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : జూన్ 11న నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు నాగర్‌కర్నూల్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ మోతిలాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో 19 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ పరీక్ష కేంద్రాల్లో 5 వేల 130 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు.

పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యుత్, తాగునీరు, సిసి కెమెరాలు తదితర సౌకర్యాలు పూర్తి చేసి పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి పట్టణ కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యల మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికాలు తీసుకువెళ్లకుండా మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేసి అనుమతించనున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు నిబంధనలను అతిక్రమిస్తే భవిష్యత్తులో ఎలాంటి పోటీ పరీక్షలు రాయకుండా డిబార్ చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News