Sunday, December 22, 2024

గ్రూప్ 4 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : జూలై 1న జరిగే గ్రూప్-4 పరీక్షలకు ఏర్పాట్లను పూర్తిచేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ ఒక ప్రకటనలో తెలి పారు. జూలై 1న నిర్వహించనున్న గ్రూప్ -4 పరీక్షల కొరకు మొదటి పేపర్‌ను ఉదయం 10 గంటల నుండి 12.30 గంటల వరకు తిరిగి 2వ పేపర్‌ను మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

పరీక్షలను రాసే అభ్యర్థులు పేపర్ 1 అభ్యర్థులు ఉద యం 8 గంటల నుండి 9.45 లోగా, మధ్యాహ్నం పేపర్ 2 అభ్యర్థులు 1 గంట నుండి 2.15 లోగా, పరీక్షా కేంద్రం లోపల ఉండాలని, ఖచ్చితంగా ఉదయం 9.45, మధ్యాహ్నం 2.15 తరువాత గేట్లను మూసివేయడం జరుగుతుందన్నారు. ఆ తరువాత ఎవరిని అనుమతించడం కుదరదని తెలిపారు. గ్రూప్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News