Wednesday, January 22, 2025

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

- Advertisement -
- Advertisement -

నల్గొండ:77వ స్వాతంత్ర దినోత్సవ వేడు కలకు జిల్లా ముస్తాబయింది. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌ను అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేయడంతో పాటు పోలీసుల పరేడ్, స్టాల్స్ ఏర్పాటు, సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణతో పాటు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, ఎస్పీ కే.అపూర్వరావు పరిశీలించి ఏర్పాట్లను చూశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆ విష్కరించనున్నారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు అవార్డుల ప్రధా నంతో పాటు సంస్కృతిక ప్రదర్శనలు, స్టాల్స్ ఏర్పాటు, ఆస్తుల పంపిణీ నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News