Sunday, November 24, 2024

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి : పట్టణంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్భందీగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కలాశాల ప్రిన్సిపల్, ఎగ్జామ్స్ చీఫ్ సూపరింటెండెంట్ సురేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం పట్టణంలోని పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాలకు అనుమతించడం జరగదని తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎడమ రాధమ్మ మెమోరియల్ కళాశాల, న్యూఎరా కళాశాల, మహాత్మా జ్యోతిరావుపూలే కళాశాలలను పరీక్ష కేంద్రాలుగా కేటాయించారన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా చక్కగా పరీక్షలు రాయాలని సురేందర్ రెడ్డి, కస్టోడియన్ వేణు పరీక్షలు రాసే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

సిఎస్, డిఓ, ఇన్విజిలేటర్స్, ఆఫీసు సిబ్బంది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వేచ్చాయుతంగా పరీక్షలు వ్రాసే విధంగా సౌకర్యాలు కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఇతరులను ఎవరిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతివద్దని ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్ సురేంధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమ ంలో ఎగ్జామ్స్ కస్టోడియన్ వేణు, అధ్యాపకులు సదాన ందం గౌడ్, రాజేష్, మల్లేష్, రమాకాంత్, నయీం, శ్రీనివాస్, బాల్‌రాజ్, భీమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News