Thursday, January 23, 2025

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్ : తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టిటిడి ఇవో ఎ.వి. ధర్మారెడ్డి వెల్లడించారు. 2023 జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు రోజుకు 80 వేల మందికి వైకుంఠ ద్వారం దర్శనం కల్పిస్తామని చెప్పారు. ఆఫ్ లైన్ విధానంలో సర్వదర్శన టోకెన్లు, ఆన్‌లైన్ విధానంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కేటాయింపు ఉంటుందన్నారు. రోజుకు 25 వేల చొప్పున 2.5 లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేస్తామన్నారు. సర్వదర్శనం భక్తులకు దర్శనం టోకెన్లను తిరుపతిలో 9 కేంద్రాలు, తిరుమలలో ఒక కేంద్రం ద్వారా జారీ చేస్తామన్నారు. ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించి ఈ టికెట్లను పొందాల్సివుందన్నారు. శనివారం తిరుమలలో అన్నమయ్య భవన్‌లో వివిధ శాఖల అధికారులతో ఇవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో ధర్మారెడ్డి మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు..

జనవరి 2 నుంచి 11 వరకు అన్ని రకాల ప్రివిలైజ్ దర్శనాలు రద్దు చేశామని, ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు. జనవరి 2న వైకుంఠ ఏకాదశి, జనవరి 3న వైకుంఠ ద్వాదశి జరగనుందని చెప్పారు. జనవరి 2న తిరుప్పావై, ధనుర్మాస కైంకర్యాల అనంతరం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుందన్నారు. రోజుకు 2000 చొప్పున శ్రీవాణి టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని, అందుకు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవల్సివుంటుందని ఆయన పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే దర్శన టికెట్లు కేటాయిస్తామని, సిఫార్సు లేఖలు తీసుకోబడవని ఆయన స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దృష్టా డిసెంబర్ 29 నుంచి జనవరి 3 వరకు వసతి గదుల అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేశామన్నారు. గదుల కేటాయింపులో పారదర్శకత పెంచేందుకు మరిన్ని కౌంటర్లు పెంచి సిఆర్వోలో మాత్రమే కేటాయిస్తామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News