సిఎండి రఘుమారెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో 201 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఈనెల 31వ తేదీన జరిగే రాత పరీక్షకు పకడ్భందీ ఏర్పాట్లు చేసినట్టు సిఎండి రఘుమారెడ్డి తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ కేంద్రాల్లో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ పరీక్ష జరగనున్నట్టు ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంస్థ వెబ్‌సైట్ www.tssouthernpower. cgg.gov.in నుంచి హాల్ టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌లో పొందు పరిచిన సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ తో పాటు ఫొటో స్పష్టంగా కనిపించే విధంగా ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్‌కార్డు / పాన్‌కార్డు / డ్రైవింగ్ లైసెన్స్) వంటి ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని ఆయన సూచిం చారు. సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్/ స్మార్ట్ వాచీలు, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడవని ఆయన తెలిపారు.
10:30 గంటల తరువాత వస్తే పరీక్షా కేంద్రంలోకి…
అభ్యర్థులు రాత పరీక్ష జరిగే సమయం 10:30 గంటల తరువాత వస్తే పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని, 12:30 గంటలకు ముందు పరీక్ష కేంద్రం నుంచి బయటకు అనుమతించరని ఆయన పేర్కొన్నారు. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రం, సమయం వంటి వివరాలు ముందుగానే సరిచూసుకుని పరీక్ష సమయానికి కనీసం 60 నిముషాలు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి.రఘుమా రెడ్డి తెలిపారు.