Wednesday, January 22, 2025

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ గూర్చి అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహిస్తున్న గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షను జిల్లాలో 20 సెంటర్లలో 7768 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. టిఎస్పిఎస్సి బోర్డు వెలువరించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కటి చదువుతూ అధికారులకు వివరించారు.

ప్రతి అధికారి పరీక్ష నిర్వహణ రోజు ముందు రోజు ఏం చేయాలని ఎలా నిర్వహించాలనే విషయాల గురించి దిశా నిర్దేశం చేశారు. పరీక్ష సెంటర్‌లో ప్రతి గదిని చెక్ చేయాలి. గుదులలో పరీక్ష రాసే అభ్యర్థులకు సౌకర్యవంతంగా కూర్చునేలా పర్నిచర్, లైట్లు , ప్యాన్లు అన్ని ఉండేలా చూడాలన్నారు. అభ్యర్థుల సిట్టింగ్ ఆరెంజ్ మెంట్ జాగ్రత్తగా చేయాలన్నారు. సిసి కెమెరాలు సెంటర్ మొత్తం లేదా కనీసం చీఫ్ సూపరింటెండెంట్ రూంలో ఆయిన తప్పని సరిగా ఉండాలి. ఏ ఒక్క సిబ్బంది దగ్గర ఫోన్, ఎలక్ట్రానిక్ గడియారం సంబంధించిన ఏవి ఉండకుండా చూసుకోవాలన్నారు. అభ్యర్థ్ధులు ఉదయం 8 గంటల నుంచి బయట చెకింగ్, బయోమెట్రిక్ అయిన తర్వాత లోనికి పంపాలన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో 10.15కు గేట్ మూసివేయాలన్నారు. వికలాంగుల కోసం స్ర్కైబ్‌లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఒకరోజు ముందే అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. సెంటర్లలో చీఫ్ సూపరింటెండెంట్‌లదే పూర్తి బాధ్యత అన్నారు. ఎలాంటి పోరపాట్లు జరగకుండా పకడ్బందీగా పరీక్షను నిర్వహించాలని అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎఓ శివప్రసాద్, కలెక్టరేట్ ఎఓ రహమాన్, చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ ఆపీసర్స్, రూట్ ఆపీసర్స్, ప్లైయింగ్ స్వాడ్స్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News