Monday, December 23, 2024

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి

- Advertisement -
- Advertisement -
  • కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్ జిల్లా: గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంత వాతవరణంలో జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 11న జరగనున్న గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షల ఏర్పాట్లపై జిల్లా అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి, చీప్ సూపరింటెండెంట్లు, రూట్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులకు కలెక్టర్ దిశా నిర్ధేశం చేశారు. గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వికలాంగల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.

స్ట్రాంగ్ రూమ్ నుండి పరీక్షల ప్రశ్నాపత్రాలు తరలించి భద్రపరచడంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో పరీక్షల నిర్వహణకు 101 కేంద్రాలను ఏర్పాటు చేసి 32 రూట్లుగా విభజించామని 49,660 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయనున్నారని కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. పరీక్షకు ముందు మాక్ డ్రిల్ నిర్వహించాలని, ఎలాంటి పరిస్థితుల్లో పరీక్ష రోజున ఉదయం 10.15 గంటల తర్వాత అభ్యర్ధులను పరీక్షా కేంద్రాలలోకి అనమతించరాదని అన్నారు. టిఎస్‌పిఎస్‌సి నియమ నిబంబధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పరీక్షల డిప్యూటీ సెక్రటరీ ఆంజనేయులు, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నేడు తెలంగాణ సుపరిపాలన దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఈనెల 10వ తేదీన తెలంగాణ సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో ఉదయం 9 గంటలకు జరుగు కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొంటారని అన్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు, ఫలితాలు తదితర వివరాలను తెలియజేసి ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలను, పరిపాలన సంస్కరణలను మరింత చేరువ చేసేందుకు కార్యక్రమం ద్వారా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో సాగునీటి రంగం, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాలు, మిషన్ భగీరథ, వైద్యం ఆరోగ్యం, విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల పునర్వవస్తీరణ తీరు, అందుతున్న సేవలను తెలియజేయడంతో పాటు ప్రజల జీవితంలో, జీవనశైలిలో వచ్చిన మార్పులపై నివేదిక తయారు చేయాలని కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News