Monday, November 18, 2024

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పకడ్భందీ ఏర్పాట్లు చేయాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పకడ్భందీగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో త్వరలో జరగనున్న 3వ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈవిఎంల డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ పాయింట్, ఈవిఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్ల కోసం స్థలం పరిశీలనలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని నెల్లికొండ మార్కెట్ యార్డును కలెక్టర్ పరిశీలించారు.

జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన 792 పోలింగ్ కేంద్రాలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ యంత్రాలు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఈవిఎంల రిసీవింగ్, భద్రత తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈవిఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన భవనాలను కలెక్టర్ పరిశీలించారు.

అందుకు కావాల్సిన ఏర్పాట్లను తదితర అంశాల ముందుస్తు ఏర్పాట్లపై అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిర్వహించిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్భందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగ్రా ఎలక్ట్రిసిటి భద్రతా తదితర అంశాలపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రస్తుతం మార్కెట్ యార్డులో ఉన్న గన్ని బ్యాగులు, మార్కెటింగ్ శాఖ పరికరాలు, వరి ధాన్యాన్ని జిల్లాలోని ఇతర మార్కెట్ యార్డు గోదాములకు తరలించాలని జిల్లా మార్కెట్ అధికారిని బాలమణిని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, నాగర్‌కర్నూల్ నూతన ఆర్డిఓ వెంకట రెడ్డి, మార్కెటింగ్ అధికారిని బాలమణి, ఇంచార్జి సివిల్ సప్లై అధికారి స్వామి కుమార్, సివిల్ సప్లై డిఎం బాలరాజ్, ఎలక్షన్ సూపరిండెంట్ జాకీర్ అలీ, ఎన్నికల డిటిలు సుదర్శన్ రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News