Thursday, November 21, 2024

గ్రూప్ 4 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి

- Advertisement -
- Advertisement -

నారాయణపేట : జిల్లాలో పకడ్బందీగా గ్రూప్ 4 పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో సంబంధిత అధికారులతో గ్రూప్ 4 పరీక్షల కో ఆర్డీనేషన్ సమీక్షా సమావేశ ం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 1న పేపర్ 1 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్ 2 .. మధ్యాహ్నం 2.30 నుండి 5 గంటల వరకు గ్రూప్ 4 పరీక్షలు జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని జిల్లాలో 7324 మంది అభ్యర్థులు 28 పరీక్ష కేం ద్రాలలో పరీక్షలకు హాజరవుతారని తెలిపారు.

నారాయణపేట, కోస్గి, మక్తల్‌లో సెంటర్స్ ఉన్నవి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పరీక్షా కేంద్రాలలో పకడ్బ ందీ చర్యలు తీసుకుంటామని ఎలాంటి అవాంఛనీయ స ంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. సెంటర్స్ దగ్గర 144 సెక్షన్ , జిరాక్స్ సెంటర్స్ మూసివేయాలని, పరీక్షల నిర్వహణ కోసం జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేకంగా నియమించడం జరిగిందని, అందులో సెంటర్ల వారీగా వారు రూట్ ఆఫీసర్స్ , పరీక్షల సంబంధిత సిబ్బంది, పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల ఆధార్ చెక్ చేయడం సెంటర్లలో కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన చూసుకుంటారని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని నియమించి అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకు ండా చర్యలు తీసుకోవాలన్నారు. మక్తల్ , కోస్గి రోడ్లలో ఆర్టీసీ బస్సులు నడపాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల దగ్గర మహిళా కానిస్టేబుల్‌ను నియమించాలన్నారు. ఈ సమీక్షా సమావేశం లో డీఎస్పీ సత్యనారాయణ, సూపరింటెండెంట్స్ జగదీష్, ఎస్‌టీఓ చారి, ఆర్టీఓ వీరాస్వామి, డిఈఐఓ రియాజ్ హుస్సెన్, డిపిఆర్వో రషీద్ , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News