Friday, November 22, 2024

ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: ఆగస్ట్ 15 న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్ అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మ ందిరం లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో వేదిక,వి. ఐ.పి .లు,అధికారులు,మీడియా,ఇతరులకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారిని ఆదేశించారు.పరేడ్ మైదానంలో త్రాగునీరు,పారిశుధ్య ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు.ముఖ్య అతిధి సందేశం రూపొందించేందుకు ఆయా శాఖలు సాధించిన ప్రగతి నివేదికలు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారికి పంపించాలని అన్నారు.

అటవీ,వ్యవసాయ,ఉద్యాన,జిల్లా గ్రా మీణభివృద్ధి శాఖ,గ్రామీణ నీటి పారుదల శాఖ,పశు సంవర్తక శా ఖ,విద్యా శాఖ, ఐ.సి.డి.ఎస్,పరిశ్రమల శాఖలు శకటాలు ,ఎస్‌సి ,ఎస్‌టి,బిసి,గిరిజన,మైనార్టీ సంక్షేమ శాఖలు ,అటవీ ,సాగు నీటి పా రుదల శాఖ,అర్&బి ఆయా శాఖలు సాధించిన ప్రగతి ని తెలుపు తూ శకటాలు,స్టాళ్లు ఏర్పాటు చేయాలని అన్నారు.ఎస్.పి.పోలీస్ బ ందోబస్తు,గార్డ్ ఆఫ్ ఆనర్ ఏర్పాటు చేయాలని అన్నారు.

పరేడ్ గ్రౌ ండ్‌లో పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని డి.ఈ.ఓ.ను ఆదేశించారు. ఆయా శాఖలు ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించేందుకు ప్రతి డిపార్ట్మెంట్ నుండి రెండుకు మించకుండా,పెద్ద డిపార్ట్మెంట్ అయితే గరిష్టంగా ముగ్గురికి మించకుండా ఉత్తమ పని తీరు కనపరిచిన ఉద్యోగుల వివరాలు డి.అర్.ఓ కు పంపించాలని అన్నారు.మెడికల్, ఏమర్జెన్సీ వైద్య సేవ లు అందించేందుకు వైద్య బృదం ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.

నిరంతర విద్యుత్ సరఫరా, లైటింగ్,జనరేటర్ ఏర్పాటు చేయాలని ఎస్.పి.డి.సి.ఎల్.అధికారిని ఆయన ఆదేశించారు.సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్,అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె.శ్రీనివాస్,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News