- మెదక్ కలెక్టర్ రాజర్షి షా
మెదక్: జూలై 1న జరిగే గ్రూప్ -4 పరీక్షలు జిల్లాలో సజావుగా నిర్వహించుటకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు ఆదేశించారు. ఎస్పి, అదనపు కలెక్టర్లతో కలిసి సమీక్షించిన కలెక్టర్ జిల్లాకు కేటాయించిన 11257 అభ్యర్థులు పరీక్షలు రాయుటకు జిల్లా వ్యాప్తంగా 30 కేంద్రాలు ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష జూలై 1న శనివారం రెండు సెషన్స్‌లో జరుగుతుందని మొదటి సెషన్ 10గంటల నుంచి12ః30 గంటల వరకు జరుగుతుందని, రెండవ సెషన్ మధ్యాహ్నం 2ః30 నుంచి 5 గంటల వరకు జరుగుతుందని అన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఉదయం 8గంటల నుంచి 9ః45 గంటలకుఉ వరకు మాత్రమే అనుమతిస్తామని మధ్యాహ్నం సెషన్‌లో 2ః15 వరకు మాత్రమే అనుమతిస్తామని వారు తెలిపారు.
అభ్యర్థులను చెప్పులతో మాత్రమే పరీక్ష హాలుకు రావాలని షూస్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా ఫోన్, క్యాలిక్యులేటర్, వాచ్, బెల్ట్ తదితర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్‌కు అనుమతి లేదని, పరీక్షా కేంద్రం గేటు బయటే అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపాలన్నారు. అభ్యర్థులు తమ వెంట డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్ సరైన పోటోగుర్తింపుకార్డుతో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌పై హాలు టికెట్ నంబర్, బుక్‌లెట్ నంబరు, బ్లూ/బ్లాక్ బాల్ పెయింట్ పెన్‌తో రాసేలా ఇన్విజిలేటర్‌లు చూడాలని, పరీక్ష హాలులో అబ్సెంట్ అయిన విద్యార్థుల సీట్లలో కేవలం ప్రశ్నపత్రం మాత్రమే ఉంచాలన్నారు. పరీక్షలుసజావుగా నిర్వహించేందుకు నియమించిన రూట్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, లయజన్ అధికారులు సమన్వయం చేసుకొని పరీక్షలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అన్ని పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, జిల్లా అధికారులు, లయజన్ అధికారులు, డిఎస్పిలు పాల్గొన్నారు.