Wednesday, January 22, 2025

శాట్స్ ఆధ్వర్యంలో ..నేటి క్రీడా వేడుకలకు ఏర్పాట్లు పరిశీలన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ : పురస్కరించుకొని సోమవారం ఉదయం 6.00 గం.లకు నిర్వహించబోతున్న “తెలంగాణ ట్రై క్రీడా వేడుకల ” ఏర్పాట్లను శాట్స్ ఛైర్మన్ ఆంజనేయ గౌడ్ ఆదివారం పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, తెలంగాణ రోరల్ స్కేటింగ్ అసోసియేషన్, తెలంగాణ ఆమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో సైక్లింగ్, రోరల్ స్కేటింగ్ రెజ్లింగ్ (మహిళ)జరిగే ఈ పోటీల ప్రారంభ వేడుకలకు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారని, ఈ క్రమంలో ఏర్పాట్లను తాను పరిశీలించినట్లు ఆయన వెల్లడించారు.

24వ తేదీ ఉదయం 6 గంటలకు నెక్లెస్ రోడ్( పీవీ జ్ఞానభూమి పక్కన) ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుందని, నెక్లెస్ రోడ్.. ఇందిరాపార్క్‌లలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించినట్లు ఆంజనేయ గౌడ్ తెలిపారు. ఈ పోటీలో పాల్గొనేక్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మల్లారెడ్డి ,దత్తాత్రేయ మోసపాటి డిప్యూటీ డైరెక్టర్ చంద్రారెడ్డి, అర్జున అవార్డు గ్రహీత అనూప్ కుమార్ యామ, చైర్మన్ ఓఎస్డి డాక్టర్ కే నర్సయ్య నిర్మల్ సింగ్ జితేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News