భీమ్‌గల్ : కెసిఆర్‌కు అత్యంత సన్నిహితుడు సోదరుడు ప్రశాంత్ రెడ్డి ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి చూస్తుంటే ప్రశాంత్ రెడ్డి పై ఈర్ష కలుగుతుంది. నాకు భీమ్‌గల్ ప్రాంత ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మంత్రితో కలిసి బస్ డిపో పునరుద్దరణకు శ్రీకారం చూడతామని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టిఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వేల్పూర్ నుండి బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి స్వయంగా వాహనం నడుపుతూ భీమ్‌గల్ చేరుకొని బస్టాండ్, బస్ డిపోలను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిలు పరిశీలించారు. భీమ్‌గల్ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న తరుణంలో శనివారం బస్ డిపోను పరిశీలించడం ప్రజలందరి హృదయాల్లో ఎంతో సంతోషం నెలకొంది. 1994 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్వయంగా వచ్చి భీమ్‌గల్ బస్ డిపోను ప్రారంభించారు. 2006లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మూత పడింది.
ముఖ్యమంత్రి కెసిఆర్ సహాయ సహకారాలతో శనిఆరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టిఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చొరవ తీసుకొని పునఃప్రారంభించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. భీమ్‌గల్ బస్ డిపో ప్రారంభంతో నిజా మాబాద్ గ్రామీణ నియోజక వర్గం , బాల్కొండ నియోజక వర్గం ఆర్మూర్ నియోజక వర్గ ప్రజలకు రవాణా సౌకర్యం చాలా సులభంగా అవుతుంది. భీమ్‌గల్ డిపో పూర్వ వైభవం కోసం కృషి చేస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డికి టిఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌కి నిజామాబాద్ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసి బస్ డిపో ప్రారంభంతో ప్రజలందరూ హార్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మధుశేఖర్, కోపాటి నర్సింహానాయుడు, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దొంకంటి నర్సయ్య, జడ్పి వైస్ రవి, ఎంపిపి మహేష్, ఆర్టీసీ డైరెక్టర్ ఉమ్మడి ఆర్టీసీ జిల్లా ఆర్‌ఎంలు డిపో మేనేజర్‌లు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు బిఆర్‌ఎస్ నాయకులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.