మోడీకి వ్యతిరేకంగా ఢిల్లీలో పోస్టర్లు… అరెస్టులపై విపక్షాల విమర్శలు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలతో కూడిన పోస్టర్‌ను ఢిల్లీ నగరంలో అతికించినందుకు సుమారు 25 మందిని అరెస్టు చేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భగ్గుమన్నారు. అదే పోస్టర్‌ను షేర్ చేస్తూ తనను కూడా అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులకు సవాల్ విసిరారు. మోదీ గారూ … మన పిల్లల వ్యాక్సిన్‌ను విదేశాలకు ఎందుకు పంపించారు?అనే ప్రశ్నతో ముద్రించిన పోస్టర్‌ను రాహుల్ షేర్ చేశారు. కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం సరిగ్గా జరగలేదంటూ మోడీపై విమర్శలతో ఓ పోస్టర్‌ను కొందరు రూపొందించారు. ఆ పోస్టర్‌ను ఢిల్లీ నగరం లోని గోడలపై అంటించిన వారిపై ఢిల్లీ పోలీసులు దాదాపు 25 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. పోలీసుల చర్యను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ట్విటర్ ఖాతాలో కూడా ఈ పోస్టర్ షేర్ అయింది. ఈ పోస్టర్‌ను షేర్ చేయడం మొత్తం వ్యవస్థను కుదిపేస్తుందని విన్నాం అని వ్యాఖ్యానించాయి.