Friday, November 22, 2024

చిట్టీల పేరుతో మోసం చేసిన దంపతుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

Arrest of a couple who cheated in the name of chits

న్యాయం చేయాలని సిసిఎస్ ఎదుట బాధితుల ధర్నా

మనతెలంగాణ, సిటిబ్యూరోః చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి పరారైన దంపతులను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలియాబాద్ ప్రాంతానికి చెందిన దంపతులు మధు, అతడి భార్య దివ్య స్థానికంగా ఆరు ఏళ్ల నుంచి చిట్టీలను నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉంటున్న వారితో చిట్టీల వేయిస్తున్నారు. దంపతులు రూ.50,000 నుంచి రూ.5లక్షల వరకు చిట్టీలు వేస్తున్నారు. సుమారు 70మంది బాధితులు నిందితుల వద్ద చిట్టీలు వేస్తున్నారు. వారి వద్ద నుంచి రూ.5.5 కోట్లు వసూలు చేశారు. చిట్టీల డబ్బులు ఇవ్వాల్సిన గడువు ముగిసినా కూడా డబ్బులు చెల్లించలేదు. డబ్బులు ఇవ్వాలని నిలదీసిన వారికి అధిక వడ్డీ ఇస్తామని చెప్పడంతో చాలామంది అడగలేదు.

ఈ క్రమంలోనే చిట్టీలు వేసిన వారికి డబ్బులు ఇవ్వకుండా దంపతులు 11 నెలల క్రితం పారిపోయారు. దీంతో బాధితులు శాలిబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును సిసిఎస్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న దంపతులను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దంపతులను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలని సిసిఎస్ ఎదుట బుధవారం ధర్నాకు దిగారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News