Wednesday, January 22, 2025

గుర్రపు పందెలు నిర్వహిస్తున్న ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

Arrest of a gang that runs horse races

 

హైదరాబాద్ : ఆన్‌లైన్‌లో గుర్రపు పందెలు నిర్వహిస్తున్న ముఠాను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.42లక్షల నగదు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నేరెడ్‌మెట్‌లోని కమిషనరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా, పాలమాకొలీ, కొత్తూరు మండలం, రెండ్డిపాలెం గ్రామానికి చెందిన తిరుమల్ రెడ్డి జోజి రెడ్డి నగరంలోని మీర్‌పేటలో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా, కొండుర్గు పోస్టుకు చెందిన ఆదూరి జోసెఫ్ రెడ్డి మియాపూర్‌లో ఉంటూ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. హన్మకొండ జిల్లా, ఎలుకుర్తి మండలం, శాంతి నగర్‌కు చెందిన ఫ్రాంక్లిన్ కోమా రెడ్డి నగరంలోని హిమాయత్‌నగర్‌లో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా, చంపాపేట్‌కు చెందిన బొక్కా మాధవ్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగి పంటర్‌గా పనిచేస్తున్నాడు.

కూకట్‌పల్లికి చెందిన డాకా రామచంద్రా రెడ్డి ప్రైవేట్ ఉద్యోగి, బోయిన్‌పల్లికి చెందిన ప్రతాప్ రెడ్డి పరారీలో ఉన్నాడు. తిరుమల్ రెడ్డి జోజిరెడ్డి హార్స్ రేసింగ్ బెట్టింగ్‌లో చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. అదే హార్స్ రేసింగ్ నిర్వహించి డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. లాక్‌డౌన్ సమయంలో ఎలాంటి హార్స్ రేసింగ్‌లు జరగలేదు, అదేసమయంలో బెట్365 యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో హార్స్ రేసింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నాడు. వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి ఆసక్తి ఉన్న వారి నుంచి బెట్టింగ్ డబ్బులు తీసుకునేవాడు. దానికి అకౌంటెంట్, పంటర్లు, సబ్ ఆర్గనైజర్లను నియమించుకున్నాడు.

తెలిసిన, తెలియని వారి నుంచి బెట్టింగ్ డబ్బులు గూగుల్‌పే, ఫోన్‌పే తదితర యాప్‌ల ద్వారా తీసుకునేవాడు. ట్రూస్టార్స్, ఆర్‌సి లెజెండ్స్ ద్వారా పంటర్లు బెట్టింగ్ నిర్వహించేవారు. ఆదూరి జోసెఫ్ రెడ్డిని సబ్ ఆర్గనైజర్‌గా, కొమా రెడ్డిని అకౌంటెంట్‌గా నియమించుకున్నాడు. ఆన్‌లైన్ ద్వారా హైదరాబాద్, బెంగళూరు, మైసూర్, ముంబాయి, కోల్‌కతా, చెన్నై మధ్య జరిగే హార్స్ రేస్‌లను బెట్టింగ్ కట్టేవారికి స్క్రీన్ షాట్‌లు తీసి వాట్సాప్‌లో పంపించేవాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ అంజిరెడ్డి, మహేందర్ రెడ్డి, ఎస్సైలు ఎండి తకియుద్దిన్, ఎఎ రాజు తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News