Saturday, November 23, 2024

మేనకోడలిని వేధించిన యువకుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Arrest of a young man who harassed his Niece

 

మనతెలంగాణ, హైదరాబాద్ : వివాహం చేసుకునేందుకు నిరాకరించిన మేనకోడలిని వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎపిలోని తాడిపత్రికి చెందిన పాలుకూరు నవీన్ ఎల్‌ఎల్‌బి రెండో ఏడాది చదువుతున్నాడు. పార్ట్‌టైం ఉద్యోగం ఓ లా హౌస్‌లో పనిచేస్తున్నాడు. నిందితుడు టిక్‌టాక్ వీడియోలు చేసేందుకు బానిసగా మారాడు. ఇందులో పరిచయమైన వారిని వేధింపులకు గురిచేయడంతో పలువురు నిందితుడిని బ్యాన్ చేశారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన బాధితురాలు పరిచయమైంది. ఆమె వరుసకు మేనకోడలు కావడంతో ఇద్దరు కొద్ది రోజులు ఛాటింగ్ చేసుకున్నారు. నిందితుడు యువతి ఫర్సనల్ ఫొటోలు, ఫ్యామిలీ వివరాలు తెలుసుకున్నాడు.

తర్వాత వివాహం చేసుకోవాలని కోరగా బాధితురాలు నిరాకరించింది. అప్పటి నుంచి బాధితురాలికి అసభ్య మెసేజ్‌లు పెట్టడమే కాకుండా, వేధింపులకు గురిచేస్తున్నాడు. నకిలీ ఇన్‌స్టాగ్రాం ఖాతా ఓపెన్ చేసి యువతి ఫొటో పెట్టి కాల్ గర్ల్ అని ట్యాగ్ పెట్టి సోషల్ మీడియాలో పెట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ ప్రకాష్ కేసు దర్యాప్తు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News