Sunday, December 22, 2024

యువతిని బ్లాక్‌మేయిల్ చేస్తున్న యువకుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Arrest of a young man who is blackmailing woman

హైదరాబాద్: నగ్న చిత్రాలు తొలగించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన నిందితుడిని హైదరాబాద్ షీటీమ్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని శివరాంపల్లికి చెందిన మహ్మద్ మోహసిన్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఓ రోజు బాధిత యువతికి ఫోన్ చేశాడు, తాను రాజును మాట్లాడుతున్నానని చెప్పాడు. బాధితురాలి మాజీ బాయ్‌ఫ్రెండ్ పేరు కూడా రాజు, ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అతడే మళ్లీ ఫోన్ చేశాడుకావచ్చని కొంత కాలం ఫోన్‌లో మాట్లాడారు. ఈ క్రమంలోనే నిందితుడికి యువతి తన నగ్న చిత్రాలు పంపించింది. తర్వాత అతడు తన మాజీ లవర్ కాదని తెలిసింది. వెంటనే నిందితుడిని కలిసి తన ఫొటోలు ఫోన్ నుంచి డిలిట్ చేయాలని కోరింది. నగ్న ఫొటోలు డిలిట్ చేయాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేకుండా సోషల్ మీడియాలో పెడుతానని బెదింరించాడు. దీంతో యువతి షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి మలక్‌పేట పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News