Friday, November 22, 2024

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎ1 నిందితుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Arrest of A1 accused in Skill Development case

 

అమరావతి: ఎపిలో వెలుగులోకి వచ్చిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో సిఐడి అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ స్కాంలో సంబంధం ఉందంటూ రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఇంట్లో సిఐడి అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. ఆయన ఆనారోగ్యంతో ఉండటం వల్ల సోమవారం హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ స్కాంలో సంబంధాలు ఉన్నాయంటూ వివిధ రాష్ట్రాలకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా ఈ కేసులో ఎ1 నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఎ1 నిందితుడిగా భావిస్తున్న గంటా సుబ్బారావును అదుపులోకి తీసుకుని వైద్యపరీక్షల నిమిత్తం విజయవాడ గవర్నమెంటు ఆసుపత్రికి తరలించారు.

చంద్రబాబునాయుడు సిఎంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు శిక్షణ నిచ్చారు. అయితే ఇందులో అవినీతి జరిగిందంటూ సిఐడి పలువురిపై అనుమానం వ్యక్తం చేసి వారి ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసింది. రిటైర్డ్ ఐఎఎస్ లక్ష్మీనారాయణను అరెస్టు చేయాలని భావించిన ఆయన అనారోగ్యంతో హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. దీంతో ఆయన తరపు లాయర్ సోమవారం ఉదయమే ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. దీంతో అతనికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 15 రోజుల వరకు లక్ష్మీనారాయణను అరెస్ట్ చేయకూడదంటూ పేర్కొంది. అయితే సోమవారం సాయంత్రం గంటా సుబ్బారావును అరెస్టు చేసింది. కాగా ఈ స్కాంలో రూ.241 కోట్ల అవినీతి జరిగిందని సిఐడి భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News