Monday, December 23, 2024

గ్యాస్ సిలిండర్లలో నీరు నింపుతున్న నిందితుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Arrest of accused filling water in gas cylinders

పోలీసుల అదుపులో ముగ్గురు డెలివరీ బాయ్స్
వివరాలు వెల్లడించిన డిసిపి రక్షితమూర్తి

హైదరాబాద్: గ్యాస్ సిలిండర్లలో నీటిని నింపి ప్రజలను మోసం చేస్తున్న ముఠాను మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 11 ఫుల్ సిలిండర్లు, ఖాళీ సిలిండర్, వాటర్ నింపిన సిలిండర్, మూడు గ్యాస్ ఫిల్లింగ్ రాడ్స్, వేయింగ్ మిషన్, ఆరు గ్యాస్ సీల్స్, కట్టింగ్ పిల్లర్, రింబ్స్ మొబైల్ ఫోన్, టాటా ఏస్‌ను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజ్‌గిరి డిసిపి రక్షితమూర్తి తన కార్యలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మౌలాలిలోని హెచ్‌పి లక్ష్మి వైష్ణవి ఎంటర్‌ప్రైజెస్‌లో జవహనగర్‌కు చెందిన కొరిపల్లి దయాకర్, చింతల బాబు, మల్లాపూర్‌కు చెందిన పొనగంటి ప్రవీణ్ డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్నారు.

ముగ్గురు కలిసి మూడు నెలల నుంచి గ్యాస్ సిలిండర్లలో వాటర్‌ను నింపి వినియోగదారులకు డెలివరీ చేస్తున్నారు. మూడు నెలల నుంచి నిందితులు వాటర్ నింపుతున్నారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో హెచ్‌పి గ్యాస్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురు డెలివరీ బాయ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు నిందితులు 280 గ్యాస్ సిలిండర్లను వాటర్‌తో నింపినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్స్‌స్పెక్టర్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News