Friday, November 22, 2024

కృష్ణ జింకలను వేటాడిన నిందితుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

Arrest of accused for poaching Deer

 

ముగ్గురి అరెస్టు, పరారీలో మరో నిందితుడు
నగరానికి చెందిన నిందితుల నిజామాబాద్‌లో వేట
వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్

మనతెలంగాణ, హైదరాబాద్ : కృష్ణ జింకలను వేటాడిన కేసులో ముగ్గురు నిందితులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి జింకతోపాటు జింక మాంసం, కారు, మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిర్మల్ జిల్లా, కుబీర్ మండలం, చాటా గ్రామానికి చెందిన చవన్ శంకర్ బాబా, నిజామాబాద్‌కు చెందిన ఎండి జుబేయిర్,నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎండి సల్మానుద్దిన్ అలియాస్ సల్మాన్ నగరంలోని ఆసిఫ్‌నగర్‌లో ఉంటున్నాడు. బోధన్‌కు చెందిన ఇమ్రాన్ పరారీలో ఉన్నాడు. నలుగురు నిందితులు కలిసి జింకలను వేటాడి అవసరం ఉన్న వారికి జింక మాంసం విక్రయిస్తున్నారు. శంకర్ వ్యవసాయం చేస్తుండగా వస్తున్న డబ్బులు సరిపోవడంలేదు. దీంతో కృష్ణ జింకలను వేటాడుతున్నాడు.

ఈ క్రమంలోనే నిజామాబాద్‌కు చెందిన ఎండి జుబేయిర్‌తో పరిచయం ఏర్పడింది. ఇతను మీడియేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అవసరం ఉన్న వారికి మాంసం లేదా ప్రాణంతో ఉన్న జింకలను విక్రయిస్తున్నారు. తన స్నేహితుల ద్వారా సల్మానుద్దిన్ పరిచయం అయ్యాడు. అతడు స్నేహితుల సాయంతో అవసరం ఉన్న వారికి జింక మాంసం విక్రయిస్తున్నారు. రెండు జింకలను వేటాడిన చవాన్ శంకర్ తన వద్ద ఉంచుకుని జుబేర్‌కు విషయం చెప్పాడు. దీంతో నగరం నుంచి కారును అద్దెకు తీసుకుని సల్మానుద్దిన్ నిజామాబాద్‌కు వెళ్లాడు. రూ.15,000 జింకను కొనుగోలు చేశాడు. ఒకదానిని చంపివేసి బోధన్‌కు చెందిన ఇమ్రాన్‌కు మాంసం, హెడ్, కాళ్లు విక్రయించాడు.

అందరు కలిసి నగరంలోని ఆసిఫ్‌నగర్‌కు తిరగి వచ్చారు. ఈ విషయం సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలియడంతో దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి జింక కాళ్లు, తల, కారును స్వాధీనం చేసుకున్నారు. గతంలో నిందితులు శంకర్, జుబేర్ పది సార్లకంటే ఎక్కువగా జింకలను వేటాడి విక్రయించారు. టాస్క్‌ఫోర్స్ ఎడిసిపి చక్రవర్తి గుమ్మి పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సై చంద్రమోహన్, శ్రీశైలం, ఎండి తకియుద్దిన్, నరేందర్, సిబ్బంది పట్టుకున్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులను నగర సిపి అంజనీకుమార్ అభినందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News