Wednesday, January 22, 2025

నార్సింగి కిడ్నాప్ కేసులో నిందితుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఎమ్మార్పీఎస్ నాయకుడి కిడ్నాప్ కేసులో నిందితులను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్, అతని స్నేహితుడి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నాలుగు బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ముంబయిలో నలుగురిని అరెస్టు చేశారు. నార్సింగిలోని బృందావన్ కాలనీలో వెయ్యి గజాల భూమికి సంబంధించి వివాదం నడుస్తోంది. దీన్ని కొందరు ఏపీలోని గుంటూరుకు చెందిన హరికృష్ణకు రూ.3 కోట్లకు అమ్మారు. దాన్ని చదును చేయించేందుకు సిద్ధమవుతున్న క్రమంలో పాత నేరస్థులతో కూడిన మాఫియా బలవంతంగా భూమిని ఆక్రమించారు.

విషయం తెలుసుకున్న హరికృష్ణ.. నార్సింగికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్‌ను అక్కడికి పంపించారు. ఈ నెల 10న నరేందర్, తన స్నేహితుడు ప్రవీణ్ తో కలిసి అక్కడికి వెళ్లారు. అక్కడ ఉన్న మీర్ సుజాత్ ఆలీ ఖాన్, మీర్ అజ్మత్ ఆలీ ఖాన్, షకీల్ , ఎండి ఇద్రీస్‌ను ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించగా వారిని దుండగులు అపహరించారు. ఫాంహౌస్‌లో బంధించి చిత్రహింసలు పెట్టారు. వేడినీళ్లు పోస్తూ చితకబాదారు. నరేందర్, ప్రవీణ్‌ను మూడు రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. అనంతరం వారి నుంచి బయటపడిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన నార్సింగి పోలీసులు తాజాగా నలుగురిని అరెస్టు చేశారు. వారిని నేడు కోర్టులో హాజరుపర్చి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News