నలుగురు బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు
నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: మ్యాట్రిమోనిలో యువతుల ఫొటోలు చూసి వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, మూడు చెక్‌బుక్‌లు, ఎటిఎం కార్డు, పాస్‌బుక్, రూ.3,20,000 స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… ఎపిలోని విజయవాడ, పోరంకికి చెందిన పొట్లూరి శ్రీబాల వంశీకృష్ణ ఖమ్మంలోని భుహురాన్‌పూర్‌లో ఉంటున్నాడు. నిందితుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోవడంతో భార్య విడాకులు ఇచ్చింది. ఆన్‌లైన్‌లో హార్స్ రేసింగ్ బెట్టింగ్‌కు బానిసగా మారడంతో నిందితుడికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో తన వివరాలు పొందుపర్చాడు. నలుగురు బాధితులకు తాను ఎన్‌ఆర్‌ఐగా బి ల్డప్ ఇచ్చాడు. వారికి మాయ మాటలు చెప్పి వీసా, తదితర ఛా ర్జీల కింద డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పి లక్షలాది రూపాయ లు వసూలు చేశాడు.
దీంతో గతంలో నగర సిసిఎస్ పోలీసులు, నాంపల్లి, చైతన్యపురి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలోనే చౌటుప్పల్‌కు చెందిన బాధితురాలు ఏప్రిల్, 2021లో మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో సాయిప్రణవ్ పేరుతో పేరు నమోదు చేసుకున్నాడు. బాధితురాలిని వివాహం చేసుకునేందుకు ఆసక్తి ఉన్నట్లు చెప్పాడు. వెంటనే ఫోన్‌లో మాట్లాడి వివరాలు చెప్పాడు. అమెరికా తీసుకుని వెళ్తానని చెప్పాడు. వెంటనే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఖాతా తీయాలని చె ప్పా డు. ఇసాకు చెప్పి పాన్, ఆధార్ కార్డు, ఫొటోలు తదితరాలను సే కరించాడు. అలాగే వీసా కోసం రూ. 90,000 తీసుకున్నాడు. తర్వాత బాధితురాలి ఎస్‌బిఐ యోనో ఇంటర్ నెట్ బ్యాంకు క్రెడెన్షియల్స్ తీసుకుని రుణం కోసం అర్హత ఉందా లేదా అని తనిఖీ చేశాడు. ముందుగా రుణం కోసం రూ.8లక్షల ముందస్తు రుణం కోసం దరఖాస్తు చేశాడు. బాధితురాలి బ్యాం కు ఖాతాలో డబ్బులు డిపాజిట్ కాగానే వెంటనే తన బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. తర్వాత నుంచి తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.