Friday, November 22, 2024

డ్రగ్స్ విక్రయిస్తున్న నిందితుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

Arrest of accused selling drugs

11మందిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు
50 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, 45 కిలోల గంజాయి, మూడు కార్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర

హైదరాబాద్ : డ్రగ్స్, గంజాయి విక్రయిస్తున్న పదకొండు మంది నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 50 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, 45 కిలోల గంజాయి, రూ.22,200 నగదు, 11 మొబైల్స్, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని చార్మినార్‌కు చెందిన మహ్మద్ బీన్ హసన్ కొలానీ అలియాస్ మాలిక్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. నగరంలోని లకిడికాపూల్‌కు చెందిన కొండ్‌లే రాకేష్, ముంబాయికి చెందిన రహేడ్ అలీ నిహాల్ అహ్మద్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు, ముంబాయికి చెందిన యాసిన్ ఖాన్ డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ముంబాయి, థానాకు చెందిన ఇఫ్తికార్ అహ్మద్ అలియాస్ శ్యాం క్లాత్ వ్యాపారం చేస్తున్నాడు. అందరు కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నారు, ముంబాయికి చెందిన యాసిన్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్ అలియాస్ శ్యాం డ్రగ్స్ విక్రయిస్తుండగా వాటిని నగరానికి రహేడ్ అలీ నిహాల్ అహ్మద్ తీసుకువస్తున్నాడు. ఇక్కడ రాకేష్, మహ్మద్‌బిన్ హసన్ కొలానికి అందజేస్తున్నాడు. వీరు స్థానికంగా అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు.

ఈ క్రమంలోనే నిందితులు మాదాపూర్‌లోని వెస్ట్ ఇన్ హోటల్ వద్ద ఉండగా మాదాపూర్ ఎస్‌ఓటి, మాదాపూర్ పోలీసులు కలిసి అరెస్టు చేశారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను బాలానగర్ జోన్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5 గ్రాముల ఎండిఎంఏ, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఎపిలోని కృష్ణాజిల్లా, ఉయ్యూరు మండలం, గ్రామానికి చెందిన మారేడు శ్రీనివాస్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. మేడ్చెల్ జిల్లా, శివంపేట, ముక్దంపూర్‌కు చెందిన జుడే జీవన్ స్టూడెంట్, జగద్గిరిగుట్టకు చెందిన ఆలోగోయ్ భవానీ శంకర్ స్క్రాప్ వ్యాపారం చేస్తున్నాడు. విజయవాడకు చెందిన ఆఫ్రిది, బెంగళూరుకు చెందిన సుధాకర్ పరారీలో ఉన్నారు. ముగ్గురు కలిసి ప్రగతి నగర్‌లో డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఓటి మాదాపూర్, బాలానగర్, మాదాపూర్, రాజేంద్రనగర్, బాచుపల్లి పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

గంజాయి పట్టుకున్న రాజేంద్రనగర్ పోలీసులు…

ఎపిలోని విశాఖపట్టనం నుంచి ముంబాయికి గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను రాజేంద్రనగర్ పోలీసులు, మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 45 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా, అడ్డాకుల మండలం, గౌరిదేవిపల్లి గ్రామానికి చెందిన పిట్టల కుపెందర్ సివిల్ కాంట్రాక్టర్, మహారాష్ట్ర, జలగావ్‌కు చెందిన నూర్ మహ్మద్ అబ్దుల్ సలాం పటేల్ క్లాత్స్ వ్యాపారం చేస్తున్నాడు, గొవింద్ రవీందర్ బావిశ్వాల్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ముగ్గురు నిందితులు కలిసి ఎపిలోని విశాఖపట్టనం నుంచి హైదరాబాద్ మీదుగా ముంబాయికి గంజాయిని తరలిస్తున్నారు. నిందితులు టాటా ఇండిగో కారులో మీర్ మహ్మద్ మజీద్ కారులోని గంజాయిని వేరే వాహనంలోకి మారుస్తుండగా మాదాపూర్ ఎస్‌ఓటి, రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడిని అదుపులోకి తీసుకుని విచారించగా మిగతా నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు గంజాయిని కొనుగోలు చేసి డబ్బులను వివిధ రూపాల్లో ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News