ఒడిసాకు చెందిన తాపీమెస్త్రీ
గొడవలతో పుట్టింటికి వెళ్లిన భార్య
అరెస్టు చేసిన జవహర్‌నగర్ పోలీసులు
హైదరాబాద్: బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని జవహర్‌నగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. ఒడిసా రాష్ట్రం, భద్రక్ జిల్లా, టికిడి తాలూక, కంపాడ గ్రామానికి చెందిన అభిరాం దాస్ అలియాస్ అభి పన్నెండేళ్ల క్రితం బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి కీసర మండలం, బండ్లగూడలో ఉంటూ తాపీమెస్త్రీ చేస్తున్నాడు. భార్యభర్తల మధ్య విభేదాలు రావడంతో భార్య అభిరాంను విడిచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న అభిరాం మేస్త్రిపనికి వెళ్తున్నాడు. వ్యసనాలకు బానిసగా మారిన నిందితుడు పిల్లలను తీసుకుని వెళ్లి లైంగిక కోరికలు తీర్చుకుంటున్నాడు. ఈ క్రమంలోనే 4వ తేదీన వెంకటేశ్వర కాలనీకి వచ్చాడు. అప్పుడే తన నానమ్మతో కలిసి కిరాణాషాపుకు వచ్చిన బాలిక(మూడున్నరేళ్లు)ను కిడ్నాప్ చేసి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకుని వెళ్లాడు. బాలికపై అత్యాచారం చేసి స్పృహకోల్పోగానే రాత్రి తీసుకుని వచ్చి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద వదిలేసిపోయాడు.
బాలిక కన్పించకుండా పోవడంతో పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులకు వెతికినా ఆచూకీ లభించలేదు, స్థానికులు బాలిక వాటర్ ట్యాంక్ వద్ద గాయాలతో ఉండడంతో పోలీసులకు చెప్పడంతో వెంటనే ఆమెను తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే నిందితుడు మళ్లీ కిరాణాషాపు వద్దకు వచ్చాడు. కిరాణాషాపు నిర్వహిస్తున్న మహిళ, ఆమె కుమార్తె(9)తో కలిసి షాపులో కూర్చుంది. నిందితుడు వచ్చి సిగరేట్ తీసుకుని బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ప్రైవేట్ పార్ట్‌ను టచ్ చేయడంతో బాలిక కేకలు పెట్టింది. తల్లి దగ్గరికి రావడంతో నిందితుడు పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలించారు. మహ్మద్ నగర్‌లోని ఓ ఇంట్లో నిందితుడు ఉండగా పోలీసులు పట్టుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్సెక్టర్లు బిక్షపతిరావు, మధుకుమార్, నరేందర్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, నవీన్, వెంకటేశ్వర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు కలిసి నిందితుడిని పట్టుకున్నారు.