Sunday, February 23, 2025

మ్యాట్రిమోని కేసులో ఆఫ్రికా దేశస్థుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Arrest of an African national in matrimonial case
Arrest of an African national in matrimonial case

 

రూ.10లక్షలు తీసుకుని మోసం చేసిన నిందితుడు

హైదరాబాద్: మ్యాట్రిమోని కేసులో వివాహం చేసుకుంటానని డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో ఆఫ్రికా దేశస్థుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన మహిళ వివాహం కోసం మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో తన వివరాలను రిజిస్టర్ చేసుకుంది. ఆఫ్రికా దేశానికి చెందిన కాబ్రాల్ ఎడ్‌మాండో అలియాస్ బ్రైట్ అలియాస్ షఖా ఢిల్లీ, ద్వరకలో బార్బర్‌గా పనిచేస్తున్నాడు. బాధితురాలికి కృష్ణకుమార్ అనే పేరుతో రిక్వెస్ట్ పంపాడు. తాను స్కాట్‌లాండ్‌లో ఉంటున్నానని చెప్పాడు. వాట్సాప్‌లో ఇద్దరు తరచూ చాటింగ్ చేసుకునేవారు. ఈ క్రమంలోనే తాను ఇండియాకు ఐదు రోజుల్లో వస్తున్నానని చెప్పాడు.

కుటుంబ సభ్యులతో వివాహం గురించి మాట్లాడాలని చెప్పాడు. ఫిబ్రవరి8వ తేదీన ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి బాధితురాలికి ఫోన్ వచ్చింది. తానను ఎయిర్ పోర్టు అధికారులు తన లగేజీని సీజ్ చేశారని, భారీగా ఫౌండ్లు తీసుకువచ్చానని చెప్పాడు. వాటిని రిలీజ్ చేసేందుకు క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలని చెప్పాడు. దానికి కొంత డబ్బులు చెల్లించాలని తెలిపారు. తనకు ఇండియా ఎవరూ తెలిసినవారు లేరని, ఇండియన్ రూపాయల్లో చెల్లించాలని చెప్పాడు. నిందితుడి మాటలు నమ్మిన బాధితురాలు రూ.10,65,000 ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేసింది. తర్వాత నుంచి నిందితుడు ఫోన్ నంబర్ స్విచ్‌ఆఫ్ కావడంతో తాను మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు సోషల్ మీడియాలో మ్యాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న మహిళలను అందంగా ఉండే పురుషుల ఫొటోలు ప్రొఫైల్‌గా పెట్టుకుని మోసం చేస్తున్నాడు. ఇన్స్‌స్పెక్టర్ గంగాధర్,ఎస్సై సంతారావు, తిరుపతి, పిసిలు సునీల్, నర్సింగ్ తదితరులు నిందితుడిని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News