Monday, December 23, 2024

కిడ్నాప్‌కు యత్నించిన వ్యక్తుల అరెస్టు

- Advertisement -
- Advertisement -
  • ఇచ్చిన డబ్బులు అడిగిన్నందుకే కిడ్నాప్ ప్లాన్
  • పాత నేరస్తుడు, స్నేహితులతో కలిసి కిడ్నాప్
  • విలేకర్ల సమావేశంలో మల్కాజిగిరి డిసిపి జానకి

ఘట్‌కేసర్: తన భార్య తరుపున తను డబ్బులు చెల్లిస్తానని నమ్మబలికి ఓ యువకుడిని కిడ్నాప్‌కు ప్రయత్నించిన నిందితులను పోలీసులు సొమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మల్కాజిగిరి డిసిపి జానకి, తెలిపారు. ఈ మేరకు ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్‌లో ఏసిపి నరేష్ రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ మహేందర్‌రెడ్డిలతో కలసి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పీర్జాదిగూడ బుద్ధ్దనగర్‌కు చెందిన కీసర అవినాష్‌రెడ్డికి 2015లో సమీపంలో నివా సం ఉంటున్న ఆరోషికారెడ్డితో పరిచయం ఏర్పడిందని, నాటి నుండి అరోషికా రెడ్డి తన అవసరాలకు 30 లక్షల రూపాయలు తీసుకుందని, తదనంతరం ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిన్ను పెళ్లి చేసుకుంటానని కుటు ంబసభ్యులకు సయితం నమ్మబలికినట్లు తెలిపారు.

ఆరోషికారెడ్డి కొంతకాలం తర్వాత అవినాష్‌రెడ్డిని దూరం పెడుతూ వచ్చిందని చెప్పారు. దీనితో డబ్బులు ఇవ్వాలని మరింత ఒత్తిడి పెంచడంతో గత రెండు వారాలుగా రంగంలోకి దిగిన సిద్దిపేటకు చెందిన నాయకుడు చక్రధర్‌గౌడ్ అవినాష్ రెడ్డితో వాట్సాప్ చాటింగ్ చేస్తూ వచ్చినట్లు, ఆరోషికా రెడ్డి డబ్బులు నేను చెల్లిస్తానని చాటింగ్‌లో తెలపడంతో ఆదివారం మధ్యాహ్నం ఘట్‌కేసర్ బైపాస్ రోడ్డులోని ఓ హోటల్ వద్దకు అవినాష్ రెడ్డి చేరుకున్నట్లు అప్పటికే అక్కడ ఒక కారులో ఉన్న చక్రధర్ గౌడ్ వద్ద చేరుకొని కారులో మాట్లాడుకుంటున్న సమయంలో మరో ముగ్గురు నిదింతులు కారులోకి చేరి అవినాష్ రెడ్డి ఫోన్ తీసుకొని అతని కిడ్నాప్‌కు ప్రయత్నించగా వారి నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా తోపులాట జరిగినట్లు తెలిపారు.

ఈ క్రమంలో అవినాష్‌రెడ్డి అరవడంతో చుట్ట్టూ ప్రక్కల వారు రావడాన్ని గుర్తించిన నిందితులు వారి బుల్లెట్ వాహనం వదిలి కారులో తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. అవినాష్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్‌కు ప్రయత్నించిన ప్రధాన నిందితుడు హైదరాబాద్ బాచుపల్లి ప్రగతినగర్‌కు చెందిన గాధగోని చక్రధర్ గౌడ్, హైదరాబాద్ రాంనగర్ అడిక్‌మెట్ లలితానగర్‌కు చెందిన ఏ2 మామిళ్ళ గౌతం రాజును, మేడ్చల్ పట్టణం ఇందిరా నగర్ కాలనీకి చెందిన ఏ3 ఏ. నర్సింగ రావును, సికింద్రాబాద్, చిలకలగూడ, పార్సిగుట్టకు చెందిన ఏ4 బౌత్ వినోద్‌లను అరెస్టు చేసి విచారించగా ప్రధాన నిందితుడు చక్రధర్ గౌడ్, ఆరోషికారెడ్డిలు 2018లో వివాహం చేసుకున్నట్లు, వీరి వివాహానికి ముందే 2015లో అవినాష్ రెడ్డి వద్ద తీసుకున్న 25 లక్షల రూపాయల అప్పులో 9 లక్షలు జనవరి 2023లో చెల్లించినట్లు తెలిపారు.

మిగిలిన డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేసినందుకే ప్రణాళిక ప్రకారం కిడ్నాప్‌కు యత్నించారని, గతంలో చెర్లపల్లి కారాగారంలో చక్రధర్ గౌడ్‌కు పరిచయమైన పాత నేరస్తుడితో కిడ్నాప్, హత్యాయత్నానికి ప్రణాళిక చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గంటల వ్యవధిలో కిడ్నాప్‌కు యత్నించిన నిందితులను ఎస్‌హెచ్‌ఓ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టుకున్న స్థానిక పోలీసులను డిసిపి జానకి నాయక్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు సిహెచ్. సుధాకర్, డి. అశోక్, బి. శ్రీకాంత్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సమాజిక మాధ్యమాల ద్వారా మహిళలను వేధిస్తున్న ముగ్గురి అరెస్టు

సమాజిక మాధ్యమాల ద్వారా కళాశాల విద్యార్థినులను అసభ్యకరమై సందేశాలతో నిత్యం వేధిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు డిసిపి జానకి, ఏసిపి నరేష్ రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ మహేందర్‌రెడ్డిలు తెలిపారు. ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన వసతి గృహం విద్యార్థినులను ఫోన్ లో అసభ్యకరమైన సందేశాలతో వేధింపులకు గురిచేస్తున్నట్లు సదర్ కళాశాల ప్రిన్సిపల్ ఫిర్యాదులో పేర్కొన్న ఫోన్ నంబర్ల ఆధారంగా గుంటూరు జిల్లా కొర్రెపాడు గ్రామానికి చెందిన కెరీర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన చొప్పర లక్ష్మీ గణేష్, కాకినాడ పట్టణం ఇంద్రపాలెం, నేరెల్లమ్మ ప్రాంతానికి చెందిన కొతగిరి వీరబాబు, కాకినాడ పట్టణం నాగమల్లితోవ జంక్షన్, రాజేశ్వరినగర్ ప్రాంతానికి చెందిన చిట్టిబోయిన దుర్దరాజులను సోమవారం అరెస్టు చేసినట్లు తెలిపారు.

మహిళలు ఇలాంటి గుర్తు తెలియని వ్యక్తుల నుండి వేధింపులను నివారించడానికి రాచకొండ కమిషనర్ డిఎస్. చౌహన్ ప్రత్యేక చొరవతో 8712662662 హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారని, ఈ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని డిసిపి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News