Friday, November 22, 2024

కార్ల దొంగల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Arrest of car thieves in Hyderabad

ఢిల్లీలో కొట్టేసి… హైదరాబాద్‌లో విక్రయం
ముగ్గురు నిందితుల అరెస్టు
చోరీ చేసిన 15 కార్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర

హైదరాబాద్: చోరీ చేసిన కార్లను విక్రయిస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్‌ఓటి, రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి 15 కార్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కార్ల విలువ రూ.2,30,00,000 ఉంటుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్, అత్తాపూర్‌కు చెందిన మహ్మద్ అజహర్ జావీద్ అలియాస్ మమ్ము వాహనాల డీలర్‌గా పనిచేస్తున్నాడు, మహ్మద్ జహీర్ చదువుకుంటున్నాడు, మైలార్‌దేవ్‌పల్లి, బండ్లగూడకు చెందిన మహ్మద్ అమాన్ ఖాన్ చదువుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గులాం నబీ పరారీలో ఉన్నాడు. మహ్మద్ అజహర్ జావిద్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. తర్వాత నగరంలో ప్రైవేట్ ఉద్యోగం కోసం వెతికినా లభించలేదు.

ఈ క్రమంలోనే నిందితుడి సోదరి ఖతార్‌లో ఉండడంతో 2016లో వెళ్లాడు. అక్కడ వారి ఇంటిలోనే ఉంటూ సూపర్‌మార్కెట్, రెస్టారెంట్లలో ఉద్యోగం చేశాడు. హైదరాబాద్‌కు 2020లో తిరిగి వచ్చాడు. ఇక్కడ ఉద్యోగం కోసం వెతుకుతుండగా ఓఎల్‌ఎక్స్‌లో కార్లను విక్రయించడం చూశాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గులాం నబీ ఓఎల్‌ఎక్స్‌లో పెట్టిన ప్రకటన చూసి ఫోన్ చేశాడు. కారు వివరాలు మొత్తం తెలుసుకుని ఇన్నోవా కారును రూ.4లక్షలకు అతడి వద్ద కొనుగోలు చేసి తీసుకుని వచ్చి ఇక్కడ రూ.6,70,000లకు విక్రయించాడు. అజహర్‌కు ఒక్కసారిగి రూ.2,70,000 లాభం రావడంతో ప్రధాన నిందితుడు గులాంకు ఫోన్ చేసి తనకు మరిన్ని కార్లు కావాలని చెప్పాడు. తన వద్ద టయోటా ఫార్చూనర్ కారు ఉందని, తక్కువ ధరకు ఇస్తానని చెప్పాడు. ముందుగా రూ.2,00,000లు ఇవ్వమని ఎన్‌ఓసి ఇచ్చిన తర్వాత మిగతా డబ్బులు ఇవ్వమని చెప్పాడు, దీనికి అజహర్ అంగీకరించి కారును తీసుకుని నగరానికి వచ్చాడు. తర్వాత ఎన్నిసార్లు గులాంకు ఫోన్ చేసినా ఎన్‌ఓసి ఇవ్వలేదు. కొద్ది రోజులకు గులాం అసలు నిజం చెప్పాడు, కారు కొట్టేసిందని చెప్పాడు. అప్పటి నుంచి గులాం వద్ద నుంచి కొట్టేసిన కార్లను కొనుగోలు చేస్తున్న నిందితులు ముగ్గురు ఇక్కడ కార్లను విక్రయిస్తున్నాడు.

బెలేనో, బ్రీజా కార్లను రూ.2 నుంచి 3లక్షలకు విక్రయిస్తున్నారు. కొనుగోలు చేసిన వారికి ఎన్‌ఓసి తెప్పిస్తామని వారికి నకలీ ఆర్‌సి తదితరాలను చూపించి అమ్ముతున్నారు. టాప్ ఎండ్ కార్లను రూ.3 నుంచి 4లక్షలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం అజహర్, జహీర్ రెండు కార్లను గులాం వద్ద కొనుగోలు చేసి తీసుకుని వస్తుండగా నాగపూర్ శివారులో మహారాష్ట్ర పోలీసులు ఆపారు. బ్రీజాకారు అజహర్ డ్రైవ్ చేస్తుండగా, బాలేనో కారును ముజాహిద్ డ్రైవ్ చేస్తున్నాడు. పోలీసులను చూసి అజహర్, జహీర్ ఇద్దరు పారిపోయి నగరానికి వచ్చారు. కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ముజాహిదిన్‌ను అరెస్టు చేశారు. నిందితులు కొట్టేసిన కార్లను నగరంలో విక్రయిస్తున్నుట్లు పోలీసులకు తెలియడంతో నిందితులను అరెస్టు చేశారు. నిందితులపై ఢిల్లీలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. శంషాబాద్ ఎస్‌ఓటి ఇన్స్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఇన్స్‌స్పెక్టర్ నాగేంద్రబాబు, డిఐ ప్రవన్‌కుమార్, ఎస్సైలు రవి, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News