Monday, December 23, 2024

క్రికెట్ బెట్టింగ్ ముఠాల అరెస్టు

- Advertisement -
- Advertisement -

Arrest of cricket betting gangs

 

హైదరాబాద్ : క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న రెండు ముఠాలను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 1,75,500 నగదు, ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…సికింద్రాబాద్, తిరుమలగిరికి చెందిన పిల్లి సాయి కుమార్ గార్మెంట్స్ వ్యాపారం చేస్తున్నాడు క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్నాడు, బేగంపేటకు చెందిన పవన్‌కుమార్ జెస్వాని పంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. సాయికుమార్‌కు క్రికెట్ బెట్టింగ్‌పై చాలా ఆసక్తి ఉంది. గతంలో కూడా పలుమార్లు బెట్టింగ్ నిర్వహించాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన సాయికుమార్ ఐపిఎల్ మ్యాచ్‌లో బెట్టింగ్ నిర్వహించాలని నిర్ణయించాడు, పంటర్‌గా పవన్‌కుమార్‌ను నియమించుకున్నాడు. www.lordsexch.com,www.Betbool247.com,www. subh999.com ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. బెట్టింగ్‌లో పాల్గొనే వారికి యూజర్ ఐడి, పాస్‌వర్డ్ ఇచ్చి ఐపిఎల్ మ్యాచ్‌లో బెట్టింగ్‌లో పాల్గొనేలా చేస్తున్నాడు.

బాల్ టూ బాల్‌కు బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. నిందితుడి వద్ద 20 నుంచి 25మంది పంటర్లు పనిచేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం తిరుమలగిరి పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు శ్రీకాంత్, అశోక్ రెడ్డి, అనంత చారి, అరవింద్ గౌడ్ తదితరులు పట్టుకున్నారు. కాగా మరో కేసులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. సికింద్రాబాద్, చిలకలగూడకు చెందిన సాంబారి విజయ్ కుమార్ ఫార్మసీ వ్యాపారం చేస్తున్నాడు క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్నాడు. దగ్గుల రమేష్ ఇంటర్‌నెట్ వ్యాపారం చేస్తున్నాడు, ఎండి అతీక్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు, నందమూడి సంతోష్ కుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు ముగ్గురు పంటర్లుగా పనిచేస్తున్నారు.

సులభంగా డబ్బులు సంపాదించేందుకు విజయ్‌కుమార్ ప్లాన్ వేశాడు. ఐపిఎల్ క్రికెట్‌లో బెట్టింగ్ నిర్వహించేందుకు పంటర్లను నియమించుకున్నాడు. వారి సాయంతో goexch9.com యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. బెట్టింగ్ కట్టే వారికి యూజర్ ఐడి, పాస్‌వర్డ్ ఇచ్చి బెట్టింగ్‌లో పాల్గొనేలా చేస్తున్నాడు. నిందితుడి వద్ద 15 నుంచి 20మంది పంటర్లు పనిచేస్తున్నారు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లో పాల్గొంటున వారి వద్ద డబ్బులు తీసుకోవండం, గెలిచిన వారికి ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా పంపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం నిందితులను చిలకలగూడ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు శ్రీకాంత్, అశోక్ రెడ్డి తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News