Friday, November 22, 2024

క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

Arrest of cricket betting operators

మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి పోలీసుల అదుపులో పంటర్లు
రూ.7,21,000 నగదు స్వాధీనం
పది మొబైల్స్, ట్యాబ్, టివి స్వాధీనం

మనతెలంగాణ, హైదరాబాద్ : క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు పంటర్లను రాచకొండ మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7,21,000 నగదు, పది మొబైల్ ఫోన్లు, ట్యాబ్, టివిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని ఒంగోల్‌కు చెందిన మద్దాలి సాయికుమార్ నగరంలోని ఓల్డ్ సఫిల్‌గూడలో ఉంటూ ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గుంటూరు జిల్లా, తెనాలికి చెందిన పులి కిషోర్ బాబు మెడికల్ వర్క్ పనిచేస్తున్నాడు. కొండుర్తి సందీప్ ఈవెంట్ మేనేజర్, గుంటూరుకు చెందిన పులి కిషోర్ కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.

సాయి కుమార్ నగరంలో పంటర్లతో గ్రూపు తయారు చేసి ఐపిఎల్‌లో బెట్టింగ్, హార్స్ రైడింగ్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. నిందితుడు బెట్టింగ్ కోసం ఇంటిని అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. కిషోర్ బాబును ఉద్యోగిగా నియమించుకున్నాడు. వాట్సాప్ ద్వారా ఆసక్తి ఉన్న వారి వద్ద నుంచి బెట్టింగ్ కడుతున్నారు. డబ్బులను ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నారు. టివిలో మ్యాచ్ చూస్తు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బెట్టింగ్ నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి వారిని అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ నవీన్‌కుమార్, నర్సిహస్వామి తదితరులు పట్టుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News