- సిపి శ్వేత
సిద్దిపేట: ఆశ్లీల ఫొటోలు, వీడియోలు ఎరా చూపి యువతను మోసం చేస్తున్న సైబర్ నిందితుల అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినందుకు సిపి శ్వేత అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో పేర్ చాట్ ద్వారా అమ్మాయిల పేర్లతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆశ్లీల ఫొటోలు, న్యూడ్ చార్ట్ ద్వారా యువకులకు పంపిస్తూ వారిని అకర్షించే విధంగా ప్రయత్నాలు చేసి తరువాత ఈ సమాచారాన్ని స్క్రీన్ షాట్ తీసి బాధితుల వాట్సాప్ నెంబర్ తీసుకొని ఆ సమాచారాన్ని పంపించి, వారి యొక్క నెంబర్ తీసుకొని మానసిక స్థితిని గమనించి డబ్బులు డిమాండ్ చేయడం డబ్బుల ఇవ్వకపోయినచో చాట్ చేసిన ఆశ్లీల సమాచారాన్ని సోషల్ మీడియాలోకి పంపిస్తామని సైబర్ పోలీసులమని బెదిరింపులకు గురి చేయడంతో ఈ బెదిరింపులకు సంబంధిత బాధితులు భయపడి నిందితులకు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించడం జరిగిందన్నారు.
బేగంపేట పోలీస్‌స్టేషన్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. కేసు పరిశోధనలో భాగంగా సిపి అదేశాల మేరకు గజ్వేల్ ఎసిపి రమేశ్ ఆధ్వర్యంలో టీం ఏర్పాటు చేసి సోమవారం మధ్యాహ్నం పై ఇద్దరు నిందితులు ఒక బాధితుడి వద్ద నుంచి కుకునూరుపల్లి బస్టాండ్ వద్ద డబ్బులు తీసుకుంటున్నారని నమ్మదగిన సమాచారంపై తొగుట సిఐ కమలాకర్, బేగంపేట ఎస్‌ఐ అరుణ్‌పై నిందితులను అందుపులోకి తీసుకోని వారి వద్ద నుంచి ఆర్ 15 మోటర్ సైకిల్, మూడు ఫోన్లు, 8 వేల రూపాయల నగదు రికవరీ చేసి నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఇద్దరు సైబర్ నిందితులను చాకచాక్యంగా టెక్నాలజీ ఉపయోగించి పట్టుకున్న గజ్వేల్ ఎసిపి రమేశ్, తొగుట సిఐ కమలాకర్, బేగంపేట ఎస్‌ఐ అరుణ్, కానిస్టేబుళ్లు రాజు, అనిల్ , రామచంద్రారెడ్డి, బస్వరాజు, మహేశ్, రవి, వెంకటేశ్, హోంగార్డ్ రాజు, నగేశ్‌లను అభినందించారు.