Monday, December 23, 2024

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ అరెస్టు… దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు

- Advertisement -
- Advertisement -

అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకొని అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి
బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని అధికార బిజెపి వ్యవహరిస్తున్నదని ఇటీవల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్, బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత అరెస్టు ఘటనలు రుజువు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇందుకోసం ఇడి,సిబిఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటున్నదని అన్నారు.

ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్న బిజెపి ప్రభుత్వ చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నదని పేర్కొన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ అని, అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News