650 కిలోల నకిలీ అల్లాం స్వాధీనం
మనతెలంగాణ, హైదరాబాద్ : నకిలీ అల్లం తయారు చేస్తున్న యూనిట్‌పై దాడి చేసిన సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.5లక్షల విలువైన 650 కిలోల అల్లంను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….హైదరాబాద్, ఆసిఫ్‌నగర్, మల్లేపల్లికి చెందిన మహ్మద్ జాఫర్ అలాం వ్యాపారం చేస్తున్నాడు, గోషామహల్‌కు చెందిన సోమ్‌నాథ్ చెట్టి వ్యాపారం చేస్తున్నాడు. ఇద్దరు కలిసి సహారా ఇండియా జింజార్ గార్లిక్ పేస్ట్ పేరుతో అల్లం తయారు చేస్తున్నారు. అల్లం తయారీలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలు ఎక్కడా పాటించడంలేదు, దీంతో ఇది తిన్న వారి ఆరోగ్యానికి హానికరంగా మారనుంది. సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం బేగంబజార్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్స్‌స్పెక్టర్ రఘునాథ్, ఎస్సైలు సాయికిరణ్ తదితరులు పట్టుకున్నారు.