Thursday, December 26, 2024

అంబాలాలో రైతుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : వరదల్లో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ నిరసనకు దిగిన పలువురు రైతులను హర్యానా లోని అంబాలా పోలీస్‌లు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి సమీపంలో శంభూ సరిహద్దుల్లో రైతులను అరెస్ట్ చేసిన పోలీస్‌లు వారిని బస్సుల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లాలో ట్రాక్టర్ ట్రాలీపై నుంచి కిందపడిన రైతు మరణించిన మరునాడే రైతులు నిరసనకు దిగడం గమనార్హం. తమ నేతలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ రైతులు పోలీస్‌లతో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణలో ఐదుగురు పోలీస్‌లు గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News