Saturday, November 23, 2024

దోపిడికి పాల్పడుతున్న నలుగురు నిందితుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ క్రైం : జిల్లాలో దోపిడీ, దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నట్లు ఎసిపి కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని 1వ టౌన్ పోలీసు స్టేషన్‌లో నిందితులను ప్రవేశపెట్టి మాట్లాడారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన ఐదుగురు నిందితుల్లో సంతోష్‌నగర్ వాసి నల్ల నవీన్, ఒడ్డెర కాలనీకి చెందిన మక్కల హరీష్, సంతోష్‌నగర్‌కు చెందిన గడ్డల దామోదర్, సంతోష్‌నగర్‌కు చెందిన రాస ప్రవీణ్, దారంగుల గంగాధర్ (పరారీ)లను సోమవారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు మోటార్ సైకిల్‌లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

ఈ ఐదుగురు ఎటువంటి పని చేయకపోగా జల్సాలకు అలవాటు పడి డబ్బులు ఎలాగైనా సంపాదించడానికి దో పిడీ చేయడానికి నిందితులు రెండు మోటార్ సైకిళ్ళ మీద జూన్ 23న నిజామాబాద్‌కు బయలుదేరారని అన్నారు. నిందితులు ఎ2, ఎ5లు చిన్నాపూర్ గండి వద్ద కట్టెలు స్క్రూ డ్రైవర్‌లను కలిగి ఉండగా నిందితులు ఎ1 నిజామాబాద్‌లోని ఆర్టీసీ బస్టాండ్‌కు అతని మోటార్ సైకిల్‌పై వచ్చి అక్కడ టీ తాగుతున్న పోతుల పోశెట్టి దగ్గరకు వెళ్లి అతన్ని చంపుతానని బెదిరించి అతనిని మోటార్ సైకిల్ పై కూర్చొబెట్టుకొని చిన్నాపూర్ గండి వద్దకు తీసుకెళ్లారని తెలిపారు.

అక్కడపై ఐదుగురు నిం దితులు బాధితున్ని బెదిరించి స్క్రూ డ్రైవర్‌తో పొడిచి కట్టెలతో కొట్టి బాధితుని వద్ద ఉన్న వెండి, బంగారం వస్తువులను, 600 రూపాయలను దోపిడీ చేశారని అన్నా రు. అటు పిమ్మట బాధితుడిని బోధన్‌లోని ఎరాజ్‌పల్లికి తీసుకెళ్లి అతని ఇంటి నుంచి 35వేలు దోచుకొని మళ్ళీ బాధితున్ని మామిడిపల్లి ఎక్స్ రోడ్ వద్ద వదిలి ఎవరికైనా చంపేస్తామని బెదిరించి పారిపోయారని ఎసిపి తెలిపారు. బాధితుడు పోశెట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి పై నిందితులను సిసి పుటేజీ ఆధారంగా పట్టుకొని కోర్టు ముందు హాజరుపరచారని తెలిపారు. ఇట్టి కేసు చేధించడంలో వన్ టౌన్ ఎస్సై విజయబాబు, ఎస్‌హెచ్‌వో హాబీబ్‌ఖాన్, టౌన్ సిబ్బంది కృషిని ఇంచార్జి సిపి ప్రవీన్‌కుమార్‌లు ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News